మాజీ సీఎం మనువడితో హీరోయిన్‌ పెళ్లి | Mehreen Kaur Pirzada to Marry to Ex CM Grandson | Sakshi
Sakshi News home page

హీరోయిన్‌ మెహ్రీన్‌కు కాబోయే భర్త ఎవరో తెలుసా..?

Published Sat, Feb 13 2021 5:55 PM | Last Updated on Tue, Feb 16 2021 6:58 PM

Mehreen Kaur Pirzada to Marry to Ex CM Grandson - Sakshi

తెలుగు చిత్ర పరిశ్రమకు ‘కృష్ణగాడి వీర ప్రేమకథ’లో నానికి జోడీగా నటించిన పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా త్వరలోనే పెళ్లి చేసుకోనుంది. బాగా రాజకీయ పలుకుబడి ఉన్న ఓ కుటుంబంలోకి కోడలిగా మెహ్రీన్‌ వెళ్లనుంది. ఎఫ్ 2లో హనీ పాపగా కనిపించిన మెహ్రీన్‌ మాజీ ముఖ్యమంత్రి మనువడిని మనువాడనుందని సమాచారం. ఈ మేరకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. త్వరలోనే మెహ్రీన్‌ కొత్త జీవితం ప్రారంభించనుంది.

హరియాణా ముఖ్యమంత్రిగా భజన్ లాల్ బిష్ణోయ్ పని చేశారు. మూడు పర్యాయాలు ఆయన సీఎంగా ఉన్నారు. అతడి మనవడు భవ్య బిష్ణోయ్‌తో ఆమె వివాహం నిశ్చయమైంది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆడంపూర్ ఎమ్మెల్యే కుల్‌దీప్ బిష్ణోయ్‌ కుమారుడే భవ్య బిష్ణోయ్‌. హర్యానాలో రాజకీయ పలుకుబడి ఉన్న కుటుంబం వీరిది. పెద్దలు వీరి పెళ్లికి అంగీకారం తెలపడంతో మెహ్రీన్‌, భవ్య కలిసి తిరుగుతూ ఎంజాయ్‌ చేస్తున్నారు. కాగా వీరి నిశ్చితార్థం మార్చి 13వ తేదీన జరగనుంది.

ఈ వేడుకకు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ విల్లా ప్యాలస్‌ వేదిక కానుంది. ఈ వేడుకకు చాలా తక్కువ మంది మాత్రమే హాజరవుతున్నట్లు తెలుస్తోంది. పెద్దలు కుదిర్చిన పెళ్లిగా తెలుస్తోంది. ఎఫ్ 2, కవచం సినిమాలతో ఆకట్టుకున్న ఈ భామ ప్రస్తుతం అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఎఫ్‌ 3 సినిమాతో బిజీగా ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement