Victory Venkatesh: Upcoming Movie Details Here - Sakshi
Sakshi News home page

Venkatesh: 2022లో వెంకీ మామ ప్లానింగ్ ఏంటి?

Published Sat, Jan 1 2022 3:09 PM | Last Updated on Sat, Jan 1 2022 3:34 PM

Victory Venkatesh Upcoming Movie Details - Sakshi

2021లో విక్టరీ వెంకటేశ్‌ రెండు సినిమాల్లో నటించాడు. అయితే ఆయన కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా ఆ రెండు కొత్త చిత్రాలు కూడా డైరెక్ట్ గా ఓటీటీలోకి  వచ్చేశాయి. జూలైలో నారప్ప, నవంబర్ లో దృశ్యం2 చిత్రాలు అమెజాన్‌ ప్రైమ్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండు కూడా రీమేక్ మూవీస్ కావడం ఒక విశేషం అయితే, రెండు కూడా నెటిజన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకోవడం మరో హైలైట్ పాయింట్.

అయితే 2021లో మాత్రం వెంకీ బాక్సాఫీస్ కలెక్షన్స్ మిస్ అయ్యాడు. 2022లో మాత్రం థియేటర్స్ ద్వారానే ప్రేక్షకులను పలకరించడానికి ఫిక్స్‌ అయ్యాడు. 2019 సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3 మూవీని ఏప్రిల్ 29న రిలీజ్ థియేటర్స్‌లో చేస్తున్నారు. మరోసారి వెంకీ, వరుణ్ ఫన్ అండ్ ఫ్రస్టేషన్ వెండితెరపై చూపించేందుకు రెడీ అవుతున్నారు.  ఈ మూవీ తర్వాత వెంకటేష్ చేయబోయే కొత్త సినిమా పై సస్పెన్స్ కొనసాగుతోంది.

త్రివిక్రమ్ ఒకటి, తరుణ్‌ భాస్క్‌ర్‌లో మరో సినిమా చేయాల్సి ఉన్నా.. ప్రస్తుతానికి ఏ డైరెక్టర్ మూవీ ఖరారు కాలేదని ఇటీవలే వెంకీ స్వయంగా చెప్పుకొచ్చాడు.పైగా నచ్చిన కథలు వచ్చినప్పుడు మాత్రమే సినిమాలు చేస్తానంటున్నాడు విక్టరీ. మరో వైపు నెట్ ఫ్లిక్స్ కోసం వెంకీ నటిస్తున్న వెబ్ సిరీస్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సిరీస్ లో రానాతో కలసి నటిస్తున్నాడు. మరి 2022లో వెంకీ మామ ప్లాన్‌ ఏంటి? తదుపరి సినిమా ఏ డైరెక్టర్‌తో చేస్తాడో వేచి చూడాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement