
విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఎఫ్ 3. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీలో మెహరీన్, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటించారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న విడుదలకానుంది. ఎఫ్ 3లో మోర్ ఫన్ ఉండబోతుందని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది.
అయితే ఫన్ మాత్రమే కాదు నటీనటులు మోర్ రెమ్యునరేషన్ కూడా తీసుకున్నారట! ఈ మేరకు ఓ వార్త ఫిల్మీదునియాలో వైరల్‌గా మారింది. దీని ప్రకారం వెంకటేశ్ ఎఫ్ 2లో రూ.5 కోట్ల పారితోషికం తీసుకున్నాడట. కానీ ఎఫ్ 3కి మాత్రం ఏకంగా మూడు రెట్లు అధికంగా అంటే ఏకంగా రూ.15 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలో పూజా హెగ్డే ప్రత్యేక సాంగ్‌లో ఆడిపాడనుంది.
చదవండి 👉🏾 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న పెద్ద సినిమాలు, అవేంటంటే?
Comments
Please login to add a commentAdd a comment