సీక్వెల్స్‌ ట్రెండ్‌.. పేరు అదే కానీ, కథ వేరు | Here Is List of Tollywood Hit Movies Sequels Deets Inside | Sakshi
Sakshi News home page

సీక్వెల్స్‌ ట్రెండ్‌.. పేరు అదే కానీ, కథ వేరు

Published Tue, Aug 9 2022 9:35 AM | Last Updated on Tue, Aug 9 2022 9:38 AM

Here Is List of Tollywood Hit Movies Sequels Deets Inside - Sakshi

‘క్రిష్‌’, ‘ధూమ్‌’, ‘దబాంగ్‌’, ‘టైగర్‌’, ‘హౌస్‌ఫుల్‌’, ‘గోల్‌మాల్‌’, ‘భాగీ’, ‘హేట్‌ స్టోరీ’, ‘మర్డర్‌’... ఇలా చెప్పుకుంటూ పోతే బాలీవుడ్‌లో ఎన్నో ఫ్రాంచైజీ సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ట్రెండ్‌ తెలుగులోనూ కనబడుతోంది. కథ ఎక్కడ ముగిసిందో అక్కడ్నుంచి కొనసాగడాన్ని సీక్వెల్‌ అంటుంటారు. కానీ కథ వేరు ఉంటుంది.. టైటిల్‌ అదే ఉంటుంది. కాకపోతే ఆ సినిమా పేరుకి 1, 2, 3 అని జోడించి ఏ భాగానికి ఆ భాగంలో కొత్త కథ చూపిస్తుంటారు. దీన్ని ఫ్రాంచైజీ అంటుంటారు. ఇక తెలుగులో రానున్న ఫ్రాంచైజీల గురించి తెలుసుకుందాం. 

చదవండి: ఆ యువ నటి శంకర్‌ కూతురిని టార్గెట్‌ చేసిందా? ఆ ట్వీట్‌ అర్థమేంటి!

ఈ మధ్యకాలంలో ప్రేక్షకులను బాగా నవ్వించిన చిత్రాల్లో ‘ఎఫ్‌ 2: ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌’ ఒకటి. వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా, తమన్నా, మెహరీన్‌ హీరోయిన్లుగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. 2019లో సంక్రాంతికి విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్లాక్‌బాస్టర్‌ హిట్‌ అందించారు. ‘ఎఫ్‌ 2’ ఇచ్చిన హిట్‌ జోష్‌తో ‘ఎఫ్‌ 3’ (2022)ని రెడీ చేసి ఆడియన్స్‌కు అందించారు అనిల్‌ రావిపూడి. ఇందులోనూ వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా, తమన్నా, మెహరీన్‌ హీరోయిన్లుగా నటించారు. తొలి భాగంలో నటించిన రాజేంద్రప్రసాద్‌ మలి భాగంలోనూ ఉన్నారు. సోనాల్‌ చౌహాన్, సునీల్‌ ఈ ఫ్రాంచైజీలో యాడ్‌ అయ్యారు. ఈ ఏడాది మేలో విడుదలైన ‘ఎఫ్‌ 3’కి కూడా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.

‘ఎఫ్‌ 3’ ఎండింగ్‌లో ‘ఎఫ్‌ 4’ హింట్‌ ఇచ్చారు అనిల్‌ రావిపూడి. ఇక హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌ కాంబి నేషన్‌లో వచ్చిన ‘ఆర్య’ (2004), ‘ఆర్య 2’ (2009) చిత్రాలను ప్రేక్షకులు అంత త్వరగా మర్చిపోలేరు. ప్రేమ ప్రధానాంశంగా రూపొందిన ఈ సినిమాలకు మంచి ఆదరణ లభించింది. కాగా ఇటీవల సోషల్‌ మీడియాలో చాట్‌ సెషన్‌లో పాల్గొన్న సుకుమార్‌ను ఓ నెటిజన్‌ ‘ఆర్య 3’ తీయాలని కోరగా, సుకుమార్‌ పాజిటివ్‌గా రెస్పాండ్‌ అవుతూ ‘ఆర్య 3’ ఉంటుం   దన్నట్లుగా చెప్పారు. ఇది ‘ఆర్య’ ఫ్యాన్స్‌ను హ్యాపీ ఫీలయ్యేలా చేసింది. మరోవైపు కల్యాణ్‌ రామ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘బింబిసార’. ఈ సినిమాతో వశిష్ఠ్‌ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ నెల 5న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

చదవండి: హీరోగా చేస్తానని చెప్పగానే నాన్న చివాట్లు పెట్టారు: దుల్కర్‌ సల్మాన్‌

సోషియో ఫ్యాంటసీ అండ్‌ టైమ్‌ ట్రావెల్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ‘బింబిసార’ను ‘బింబిసార 2’ ‘బింబిసార 3’... ఇలా ఓ ఫ్రాంచైజీగా కొనసాగించే ఆలోచనలు ఉన్నట్లుగా వశిష్ఠ్‌ చెప్పుకొచ్చారు. ఆల్రెడీ ‘బింబిసార 2’ చేయడానికి కల్యాణ్‌ రామ్‌ కూడా ఫుల్‌ పాజిటివ్‌గా ఉన్నారు. ఇక చిన్న సినిమాగా వచ్చి బ్లాక్‌బాస్టర్‌ హిట్‌ అందుకున్న సినిమాల జాబితాలోకి ‘గూఢచారి’, ‘కార్తికేయ’, ‘హిట్‌’ చేరాయి.  2018లో అడివి శేష్‌ హీరోగా శశికిరణ్‌ తిక్క దర్శకత్వంలో వచ్చిన ‘గూఢచారి’ మంచి విజయాన్ని సాధించింది. దీంతో ‘గూఢచారి 2’కు కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు అడివి శేష్‌. ‘గూఢచారి 2’కు రాహుల్‌ పాకాల దర్శకుడు. ‘గూఢచారి’ని ఓ ఫ్రాంచైజీలా కొనసాగించే ఆలోచన ఉందని, ‘గూఢచారి 2’కు తాను దర్శకత్వం వహించలేకపోయినప్పటికీ  ‘గూడఛారి’ ఫ్రాంచైజీలో వచ్చే ఏదో ఒక భాగానికి తప్పక దర్శకత్వం వహిస్తానన్నట్లుగా దర్శకుడు శశి కిరణ్‌ తిక్క ఇటీవల కొన్ని ఇంటర్వ్యూస్‌లో చెప్పారు.

మరోవైపు విశ్వక్‌ సేన్‌ హీరోగా 2020లో వచ్చిన ‘హిట్‌: ది ఫస్ట్‌ కేస్‌’ మంచి హిట్‌గా నిలిచింది. దీంతో ఇప్పుడు ‘హిట్‌: ది సెకండ్‌ కేస్‌’ సెట్స్‌పై ఉంది. అయితే ఇందులో అడివి శేష్‌ హీరోగా నటిస్తున్నారు. కానీ టైటిల్స్‌ని బట్టి ‘హిట్‌’ సినిమా ఓ ఫ్రాంచైజీలా కొనసాగే అవకాశం ఉందని ఊహించవచ్చు. ఇంకోవైపు హీరో నిఖిల్‌ కెరీర్‌కు ‘కార్తికేయ’ (2014) మంచి ప్లస్‌గా నిలిచింది.     దీంతో నిఖిల్, దర్శకుడు చందు మొండేటి మళ్లీ ‘కార్తికేయ 2’ తీశారు. ఈ నెల 13న ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. అయితే ‘కార్తికేయ 3, 4’లకు స్క్రిప్ట్‌ రెడీగా లేకపోయినప్పటికీ కోర్‌ ఐడియా ఉందని చందు మొండేటి చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. సో.. ‘కార్తికేయ 3’ కూడా ఉండొచ్చు. అలాగే ‘చిత్రం’ (2000) సినిమా ‘చిత్రం 1.1’, ‘ఢీ: కొట్టి చూడు’ (2007) తర్వాత ‘ఢీ 2: డబుల్‌ డోస్‌’, ‘డీజే టిల్లు’ తర్వాత ‘డీజే టిల్లు 2’ వంటి సినిమాలు రానున్నాయి. భవిష్యత్తులో మరిన్ని ఫ్రాంచైజీలు వచ్చే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement