‘‘ఎఫ్ 3’ లాంటి పూర్తి కామెడీ సినిమాకి కథ రాసుకోవడం కష్టం. అనిల్ రావిపూడిగారు అద్భుతంగా కథ రాసుకుని ‘ఎఫ్ 3’ తీశారు. ‘ఎఫ్ 2’లో ఉన్న వినోదం కంటే పది రెట్లు ఎక్కువగా ‘ఎఫ్ 3’లో ఉంటుంది’’ అని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అన్నారు. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్ 3’. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్ చెప్పిన విశేషాలు.
► ఓ సినిమాకి సంగీతం అందించే ముందు కథని అర్థం చేసుకుంటాను. డైరెక్టర్ ఎలాంటి మ్యూజిక్ కావాలనుకుంటున్నాడో తెలుసుకుని, నా శైలి మిస్ కాకుండా సంగీతం అందిస్తాను.
► అనిల్ రావిపూడి ఫాస్ట్‌గా సినిమా తీసినా బాగా తీయడం తన ప్రత్యేకత. జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణగార్ల సినిమాల్లో ఉండే సెన్సిబుల్ చమత్కారం అనిల్ సినిమాల్లోనూ ఉంటుంది.
► ‘దిల్’ రాజుగారు ఎన్నో సక్సెస్‌లు చూసినా కథలోని కొత్త అంశాలకి ఇప్పటికీ ఎగ్జయిట్ అవుతుంటారు. ‘ఎఫ్ 3’ సినిమాని ఆయన ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. ∙‘ఎఫ్ 3’లో అన్ని పాటలకూ ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పటికే విడుదలైన ‘లబ్ డబ్ లబ్ డబ్ డబ్బు’, ‘ఊ ఆ ఆహా ఆహా’, ‘లైఫ్ అంటే ఇట్లా ఉండాలా..’ పాటలకు మంచి స్పందన వచ్చింది. ‘నేపథ్య సంగీతం కూడా అద్భుతం.. నీకు వంద హగ్గులు.. వంద ముద్దులు’ అన్నారు అనిల్.
► సినిమా కష్టాలు తెలుసు కాబట్టి ప్రతి సినిమా హిట్ కావాలనుకుంటాను. ఎవరి మ్యూజిక్ బాగున్నా, సినిమా బాగున్నా అభినందిస్తాను. ‘మనం విజయం సాధించినప్పుడే కాదు.. ఇతరులు విజయం సాధించినప్పుడు అభినందించేవాడే గొప్ప’ అని మా నాన్నగారు (సత్యమూర్తి) చెప్పిన మాటలే నాకు స్ఫూర్తి.
► ‘రౌడీ బాయ్స్, గుడ్ లక్ సఖి, ఆడవాళ్ళు మీకు జోహార్లు’ చిత్రాల్లో పాటలు బాగున్నా మేము అనుకున్నంత రీచ్ కాలేదు. సినిమా హిట్‌ని బట్టి కూడా మ్యూజిక్ రీచ్ ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఊహించిన దానికంటే పెద్ద సక్సెస్ వస్తుంది. ఇందుకు ‘రంగస్థలం, ఉప్పెన, పుష్ప’ సినిమాలు ఉదాహరణ.
► దక్షిణాదిలోని అన్ని భాషలవాళ్లు ఎక్కువగా ఉండేది చెన్నైలోనే. అక్కడ మంచి మ్యూజిక్ స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్‌లోనూ మ్యూజిక్ స్కూల్స్ పెరుగుతున్నాయి. ఒక సంగీత పాఠశాల ఆరంభించి, ఉచితంగా నేర్పించాలనే ఆలోచన ఉంది. దానికి కొంత సమయం పడుతుంది.
చదవండి 👉🏾
ఎఫ్ 3కి మూడురెట్ల పారితోషికం తీసుకున్న వెంకటేశ్!
కాస్ట్‌లీ కారు కొన్న హీరోయిన్ కంగనా రనౌత్
Comments
Please login to add a commentAdd a comment