Music director Devi Sri Prasad
-
అది చూసి అనిల్ నాకు వంద హగ్గులు, వంద ముద్దులు అన్నారు
‘‘ఎఫ్ 3’ లాంటి పూర్తి కామెడీ సినిమాకి కథ రాసుకోవడం కష్టం. అనిల్ రావిపూడిగారు అద్భుతంగా కథ రాసుకుని ‘ఎఫ్ 3’ తీశారు. ‘ఎఫ్ 2’లో ఉన్న వినోదం కంటే పది రెట్లు ఎక్కువగా ‘ఎఫ్ 3’లో ఉంటుంది’’ అని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అన్నారు. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్ 3’. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్ చెప్పిన విశేషాలు. ► ఓ సినిమాకి సంగీతం అందించే ముందు కథని అర్థం చేసుకుంటాను. డైరెక్టర్ ఎలాంటి మ్యూజిక్ కావాలనుకుంటున్నాడో తెలుసుకుని, నా శైలి మిస్ కాకుండా సంగీతం అందిస్తాను. ► అనిల్ రావిపూడి ఫాస్ట్‌గా సినిమా తీసినా బాగా తీయడం తన ప్రత్యేకత. జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణగార్ల సినిమాల్లో ఉండే సెన్సిబుల్ చమత్కారం అనిల్ సినిమాల్లోనూ ఉంటుంది. ► ‘దిల్’ రాజుగారు ఎన్నో సక్సెస్‌లు చూసినా కథలోని కొత్త అంశాలకి ఇప్పటికీ ఎగ్జయిట్ అవుతుంటారు. ‘ఎఫ్ 3’ సినిమాని ఆయన ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. ∙‘ఎఫ్ 3’లో అన్ని పాటలకూ ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పటికే విడుదలైన ‘లబ్ డబ్ లబ్ డబ్ డబ్బు’, ‘ఊ ఆ ఆహా ఆహా’, ‘లైఫ్ అంటే ఇట్లా ఉండాలా..’ పాటలకు మంచి స్పందన వచ్చింది. ‘నేపథ్య సంగీతం కూడా అద్భుతం.. నీకు వంద హగ్గులు.. వంద ముద్దులు’ అన్నారు అనిల్. ► సినిమా కష్టాలు తెలుసు కాబట్టి ప్రతి సినిమా హిట్ కావాలనుకుంటాను. ఎవరి మ్యూజిక్ బాగున్నా, సినిమా బాగున్నా అభినందిస్తాను. ‘మనం విజయం సాధించినప్పుడే కాదు.. ఇతరులు విజయం సాధించినప్పుడు అభినందించేవాడే గొప్ప’ అని మా నాన్నగారు (సత్యమూర్తి) చెప్పిన మాటలే నాకు స్ఫూర్తి. ► ‘రౌడీ బాయ్స్, గుడ్ లక్ సఖి, ఆడవాళ్ళు మీకు జోహార్లు’ చిత్రాల్లో పాటలు బాగున్నా మేము అనుకున్నంత రీచ్ కాలేదు. సినిమా హిట్‌ని బట్టి కూడా మ్యూజిక్ రీచ్ ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఊహించిన దానికంటే పెద్ద సక్సెస్ వస్తుంది. ఇందుకు ‘రంగస్థలం, ఉప్పెన, పుష్ప’ సినిమాలు ఉదాహరణ. ► దక్షిణాదిలోని అన్ని భాషలవాళ్లు ఎక్కువగా ఉండేది చెన్నైలోనే. అక్కడ మంచి మ్యూజిక్ స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్‌లోనూ మ్యూజిక్ స్కూల్స్ పెరుగుతున్నాయి. ఒక సంగీత పాఠశాల ఆరంభించి, ఉచితంగా నేర్పించాలనే ఆలోచన ఉంది. దానికి కొంత సమయం పడుతుంది. చదవండి 👉🏾 ఎఫ్ 3కి మూడురెట్ల పారితోషికం తీసుకున్న వెంకటేశ్! కాస్ట్లీ కారు కొన్న హీరోయిన్ కంగనా రనౌత్ -
గురవే నమహా...
రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ తరం సంగీతదర్శకుల్లో ఓ సంచలనం. మరి.. ఈ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ గురువు ఎవరు? అంటే.. ‘మాండొలిన్ శ్రీనివాస్’. గురువారం టీచర్స్ డేని పురస్కరించుకుని తన గురువు మాండొలిన్ శ్రీనివాస్‌కి ఓ పాట అంకితం ఇచ్చారు. ‘గురవే నమహా...’ అంటూ సాగే ఈ లిరికల్ వీడియో సాంగ్‌ని ప్రముఖ డైరెక్టర్ సుకుమార్, పాటల రచయిత చంద్రబోస్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘మన టీచర్స్, మన గురువులు.. మనకు చదువు చెప్పిన వాళ్లు, సంగీతం నేర్పిన వాళ్లు.. ఇలా అందరూ మనకు ముఖ్యం. టీచర్స్ డే సందర్భంగా నా గురువు మేస్ట్రో మాండొలిన్ శ్రీనివాస్‌గారికి ఒక చిన్న నివాళి. ఆయన దగ్గర నేర్చుకున్న మాండొలిన్ నాలెడ్జ్తోటే ఈ పాటను నేను కంపోజ్ చేశా. మీ అందరికీ నచ్చిన పాటే. తన జీవితంలో ఎంతో మంది శిష్యుల్ని సంపాదించుకున్నారాయన. అలాంటి గురువు గొప్పతనం మాటల్లో వర్ణించలేం. అందుకే సంగీతంతో నా భావాలను వ్యక్తం చేశా. నా గురువుకు బాగా ఇష్టమైన రాగాల్లో ఒకటైన కీరవాణి రాగంలో ఈ పాటని కంపోజ్ చేశా. జీవితాలకు అర్థం చెప్పిన ప్రతి గురువుకు ఈ పాట అంకితం’’ అన్నారు. -
నేను తీసిన ఫొటోలతో త్వరలో వెబ్సైట్
ప్రముఖ సంగీత దర్శకులు దేవిశ్రీప్రసాద్ రాయదుర్గం: తనకు ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ అంటే చాలా ఇష్టమని, ఏ మాత్రం ఖాళీ దొరికినా ఫొటోలు తీస్తుంటానని ప్రముఖ సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్ వెల్లడించారు. రాయదుర్గం లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఫోటో ఎక్స్పో-2016ను ప్రారంభించేందుకు వచ్చిన సందర్భంగా తన మనోగతాన్ని విలేకరులతో పంచుకున్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో వచ్చే కెమెరాలను కొన్నేళ్ళుగా కొనుగోలు చేస్తూ భద్రపర్చుకుంటున్నానన్నారు. తాను తీసిన ఫొటోలన్నింటినీ ఒక చోట పెట్టడానికి ప్రత్యేకంగా ఒక ప్రదర్శన కన్నా వెబ్సైట్ లాంచ్ చేసి అందులో పెట్టాలని ఉందని, త్వరలో ఈ విషయమై సీరియస్‌గా ఆలోచిస్తున్నానన్నారు. ఎక్కడికి వెళ్ళినా రోడ్లు, ఖాళీ స్థలాలు, పార్కులు, అందమైన ప్రాంతాలు, మోడల్స్, డ్యాన్సర్స్ ఫొటోలను హబీగా తీస్తుంటానన్నారు. తన తండ్రి సత్యమూర్తి మంచి ఫొటోగ్రాఫర్ అని, తరువాత తయన రైటర్‌గా మారారన్నారు. తనకు కారం అంటే పడదని, అందుకే మా అమ్మ నా ఒక్కడి కోసం వేరుగా వంటచేసేదన్నారు. ఫొటోగ్రఫీలో కొత్త కొత్త అంశాల గురించి ఏవైనా సందేహాలు ఉంటే అర్ధరాత్రి, అపరాత్రి లేకుండా విల్లార్ట్ ఎం.డీ వెంకటరమణకు ఫోన్ చేసి విసిగించి సందేహాలను తీర్చుకుంటానని దేవిశ్రీప్రసాద్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలలో పిల్లలు మ్యూజికల్ ఇన్స్ట్రమెంట్స్ వాయిస్తుంటే ఫొటోలు తీయాలనే కోరిక ఉందని, కొన్ని చోట్ల తీశానన్నారు. మనదేశంలోని పిల్లలు డప్పు కొట్టే ఫొటోలను తీసి నా స్టూడియోలో ఒక గోడను ఖాళీగా ఉంచానని, దానిపై ఈ ఫొటోలన్నింటినీ ఒకేచోట అమర్చాలని చాలా రోజులుగా ఈ కోరిక ఉందని, దీనిపై దృష్టి పెట్టానన్నారు. సంగీతానికి ఫొటోగ్రఫికి చాలా అవినాభావ సంబంధం ఉందని దేవిశ్రీప్రసాద్ తెలిపారు. -
డ్యాన్స్ మాస్టర్!
రికార్డింగ్ థియేటర్లో గాయకులతో పాడించడమే కాదు....సెట్లో హీరో, హీరోయిన్లకు స్టెప్స్ కూడా కూడా నేర్పిస్తానంటున్నారు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్. ఆయన మంచి పాటలు స్వరపరచడమే కాదు.. చక్కగా పాడగలుగుతారు. డ్యాన్సులు కూడా చేయగలుగుతారు. స్టేజ్ ఎక్కితే చాలు.. పాప్ స్టార్లా రెచ్చిపోతారు. వేదికపై డ్యాన్సులతో రాక్‌స్టార్‌లా దుమ్మురేపే ఈ స్వరకర్త తాజాగా తనలోని కొరియోగ్రాఫర్‌ను తెరకు పరిచయం చేయనున్నారు. సుకుమార్ నిర్మాతగా మారి, రూపొందించిన చిత్రం ‘కుమారి 21 ఎఫ్’ సినిమాలో ఓ పాటకు దేవిశ్రీ ప్రసాద్ నృత్య దర్శకత్వం వహించడం విశేషం. పైగా ఈ పాటను ఎడిటింగ్ రూమ్‌లో తానే స్వయంగా ఎడిట్ చేసుకున్నారట. వెరైటీ ట్యూన్‌తో దేవిశ్రీ స్వరపరిచిన ఈ పాట సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని చిత్ర నిర్మాతలు విజయకుమార్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి చెప్పారు. రాజ్ తరుణ్, హేభా పటేల్ జంటగా సూర్య ప్రతాప్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది.