![Mehreen Kaur Pirzada Says Honey Role In F3 Is Best Entertaining Character - Sakshi](/styles/webp/s3/article_images/2022/05/1/55.jpg.webp?itok=Y3gUymGr)
‘హనీ ఈజ్ ది బెస్ట్’ అంటూ ‘ఎఫ్ 2’లో బోలెడంత సందడి చేశారు మెహరీన్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో వెంకటేశ్ సరసన తమన్నా, వరుణ్ తేజ్‌కి జోడీగా మెహరీన్ నటించిన విషయం తెలిసిందే. ఇదే కాంబినేషన్‌లో ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన చిత్రం ‘ఎఫ్ 3’. ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది.
కాగా ‘ఎఫ్ 2’లో అల్లరి, అమాయకత్వం నిండిన హనీ పాత్రలో కనిపించిన మెహరీన్ ‘ఎఫ్ 3’లో ఈ రెండు షేడ్స్‌తో పాటు పరిణతి చెందిన అమ్మాయిలానూ కనిపించనున్నారు. ‘‘మెహరీన్ క్యారెక్టర్ మెచ్యూర్డ్‌గా డిఫరెంట్ లేయర్స్‌తో ఉంటుంది. అలాగే పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది’’ అని చిత్రబృందం తెలిపింది. ‘‘నా కెరీర్‌లో ఇది బెస్ట్ ఎంటర్‌టైనింగ్ రోల్’’ అని మెహరీన్ అన్నారు. సోనాల్ చౌహాన్ ఓ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే పార్టీ సాంగ్‌లో నటించారు. రాజేంద్ర ప్రసాద్, సునీల్ కీలక పాత్రలు చేసిన ఈ చిత్రానికి సహ నిర్మాత: హర్షిత్ రెడ్డి.
Comments
Please login to add a commentAdd a comment