![Heroine Mehreen Pirzada Opens Up About Trobles In Film Industry - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/22/544.jpg.webp?itok=GxIcWktz)
Heroine Mehreen Pirzada Opens Up About Troubles In Film Industry: ‘సినిమా ఆర్టిస్టుల జీవితాలు చాలా విచిత్రంగా ఉంటాయి’ అంటున్నారు హీరోయిన్ మెహరీన్. సోషల్ మీడియా వేదికగా ఆమె ఓ పోస్ట్ చేశారు. ‘‘మేము (ఆర్టిస్టులను ఉద్దేశిస్తూ) అన్నీ తెలిసే అనిశ్చితితో కూడిన జీవితాన్ని ఎంచుకుంటాం. జీవితానికి ఓ గ్యారంటీ ఉండదు. కొన్నిసార్లు సినిమాల్లోని మా పాత్రల లుక్స్ కోసం శారీరకంగా కఠినమైన శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. షూటింగ్ షెడ్యూల్స్‌కు తగ్గట్లుగా మా జీవనశైలిలో ఎప్పటికప్పుడు కొత్త మార్పులు చోటుచేసుకుంటుంటాయి.
ఇది మా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. చలికాలం, వర్షాకాలం, వేసవి.. అనే తేడాలు చూడకుండా సినిమాల కోసం పని చేస్తుంటాం. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులకు దూరంగా ఉండాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఇది చాలా బాధగా ఉంటుంది. మా జీవితాల్లోనూ ఎత్తు పల్లాలు ఉంటాయి.
కెరీర్‌లో ఓ అద్భుతమైన విజయం దక్కిందనుకునేలోపే మరో వైఫల్యం వస్తుంది. ఒక్కోసారి రాత్రికి రాత్రే మా జీవితాలు మారిపోతుంటాయి(సినిమా హిట్ అండ్ ఫెయిల్యూర్‌లను ఉద్దేశిస్తూ). ఇలా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సినిమాను ఓ కళారూపంగానే గౌరవిస్తాను’’ అన్నారు. కాగా తెలుగులో మెహరీన్ ఓ హీరోయిన్‌గా నటించిన ‘ఎఫ్ 3’ విడుదలకు సిద్ధంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment