వెంకటేశ్‌తో ఫస్ట్‌ సీన్‌, చాలా కంగారుపడ్డా: హీరోయిన్‌ | Sonal Chauhan Interesting Comments On F3 Movie | Sakshi
Sakshi News home page

Sonal Chauhan: తెలుగు ఇండస్ట్రీలో గొప్పతనం అదే!

Published Fri, May 13 2022 7:12 PM | Last Updated on Fri, May 13 2022 7:12 PM

Sonal Chauhan Interesting Comments On F3 Movie - Sakshi

థియేటర్లలో నవ్వులు పంచడానికి ఎఫ్‌ 3 సినిమాతో సమ్మర్ సోగ్గాళ్ళుగా రాబోతున్నారు విక్టరీ వెంకటేశ్‌, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. థియేటర్‌లో నవ్వుల పండగ తీసుకురాబోతున్న ఎఫ్3లో వెంకటేశ్‌కు జోడీగా తమన్నా, వరుణ్ తేజ్‌కు జోడీగా మెహరీన్ సందడి చేయబోతున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ సోనాల్ చౌహాన్ కీలక పాత్ర పోషించారు. తాజాగా ఎఫ్ 3తో పాటు తన పాత్రకు సంబధించిన పలు విశేషాలు మీడియాతో పంచుకున్నారు సోనాల్.

''ఎఫ్ 3'' ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు?
''లెజెండ్'' సినిమా జరుగుతున్నప్పుడే దర్శకుడు అనిల్ రావిపూడి గారితో పరిచయం. లెజెండ్ షూటింగ్ జరుగుతున్న సమయంలో అనిల్ గారు వేరే సినిమా షూటింగ్ చేస్తున్నారు. అదే సమయంలో మాట్లాడుకున్నాం. కలిసి వర్క్ చేయాలనుకున్నాం. ఐతే చాలా ఏళ్ల తర్వాత ఆయన నుంచి ఫోన్ వచ్చింది. 'ఎఫ్3 అనే సినిమా చేస్తున్నాను. ఓ పాత్ర కోసం మిమ్మల్ని అనుకుంటున్నాను'' అన్నారు. మరో ఆలోచన లేకుండా ఓకే చెప్పాను. అనిల్ గారు కామెడీ కింగ్. అప్పటికే ఎఫ్ 2 సినిమా చూశాను. ఎఫ్ 2కి మించిన ఫన్ ఎఫ్ 3లో వుంటుంది. 

ఎఫ్ 3 ట్రైలర్ లో కూడా మీ పాత్ర గురించి ఎలాంటి డిటెయిల్ ఇవ్వలేదు.. ఇంతకీ ఎఫ్3లో మీ పాత్ర ఎలా ఉండబోతుంది?
ట్రైలర్‌లో సీక్రెట్‌గా దాచిపెట్టాం. నా పాత్రలో ఒక ట్విస్ట్ వుంటుంది. ఆ ట్విస్ట్ రివీల్ అయినప్పుడు ప్రేక్షకులు తప్పకుండా ఎంటర్‌టైన్‌ ఫీలవుతారు. ఫుల్ లెంత్ కామెడీ సినిమా చేయడం నా కెరీర్ లో ఇదే మొదటిసారి. ఇప్పటికైతే నా పాత్ర గురించి ఇంతకంటే ఎక్కువ చెప్పలేను.

మీ కెరీర్ లో ఎఫ్ 3 ఫస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ కదా..దీని కోసం ప్రత్యేకంగా హోం వర్క్ ఏమైనా చేశారా?
కామెడీ ఎంటర్ టైనర్ చేయడం నాకు కొత్త. చాలా టెన్షన్ పడ్డాను. ''ఎలా ప్రిపేర్ అవ్వాలి ? ఏవైనా సినిమాలు చూడాలా? అని దర్శకుడు అనిల్ రావిపూడి గారిని అడిగాను. ఆయన సూపర్ కూల్. ఏమీ అలోచించకుండా నేరుగా షూటింగ్‌కు వచ్చేయమని చెప్పారు. అనిల్ గారితో వర్క్ చేయడం ఆర్టిస్ట్‌కి చాలా ఈజీ. ఆయనే నటించి చూపిస్తారు. ఆయనకి చాలా క్లారిటీ ఉంటుంది. ఆర్టిస్ట్ నుంచి పర్ఫార్మెన్స్ రాబట్టుకోవడం ఆయనకు తెలుసు. ఆయన చెప్పినట్లే చేస్తే చాలు మన పని తేలికైపోతుంది. ఎఫ్ 3లో కలసి వర్క్ చేసిన తర్వాత ఆయనపై గౌరవం ఇంకా పెరిగింది. సెట్స్‌లో చాలా సరదాగా జోకులు వేస్తుంటారు. కష్టాన్ని కూడా కామెడీగా మార్చగలరు.

వెంకటేశ్‌, వరుణ్ తేజ్ లాంటి స్టార్ హీరోలతో పని చేయడం ఎలా అనిపించింది? 
వెంకటేశ్‌గారు గొప్ప నటుడే కాదు.. గొప్ప మనిషి. సెట్స్‌లో అందరితో కలిసిపోయి మాట్లాడతారు. సహనటులు ఎక్కడైనా ఇబ్బంది పడుతుంటే హెల్ప్ చేస్తారు. అలాగే ఆయన ఎప్పుడూ నిర్మాతల పక్షం నుంచి ఆలోచిస్తుంటారు. సమయం వృధా చేయడం ఆయనకి నచ్చదు. వెంకటేశ్‌ గారి నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. వరుణ్ తేజ్ చాలా పాజిటివ్‌గా ఉంటారు. చాలా ఫ్రెండ్లీ పర్సన్. వరుణ్ తేజ్ స్టార్‌తో వర్క్ చేయడం కూడా ఆనందాన్ని ఇచ్చింది. 

ఎఫ్ 3 లో మెమొరబుల్ మూమెంట్? 
ఫస్ట్ సీన్ వెంకటేశ్‌ గారితో చేయాలి. చాలా కంగారు పడ్డా. ఎలా వుంటుందో అనుకున్నా. ఐతే ఆ సీన్ చాలా కూల్‌గా జరిగింది. బెస్ట్ మూమెంట్ అది. 

దిల్ రాజు గారి నిర్మాణంలో పని చేయడం ఎలా అనిపించింది?
గ్రేట్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు గారు, శిరీష్ గారి నిర్మాణంలో పని చేయాలని ఎప్పటినుంచో కోరుకున్నాను. ఎఫ్ 3తో ఆ కోరిక తీరింది. సినిమా పట్ల ఇష్టం, అంకితభావం ఉన్న నిర్మాతలు. సినిమాకి సంబధించిన ప్రతి అంశాన్ని దగ్గరుండి చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో పని చేయడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. 

మీరు చాలా భాషల్లో నటిస్తున్నారు కదా.. తెలుగు చిత్ర పరిశ్రమ ప్రత్యేకత ఏమిటి ?
తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతలు, దర్శకులు చాలా క్లారిటీగా వుంటారు. ప్రేక్షకుడు కోరుకునే వినోదం అందించడానికి తపనపడతారు. ప్రేక్షకుడిని గౌరవిస్తారు. ఈ క్రమంలోనే గొప్ప సినిమాలు వస్తున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమ గురించి ఇప్పుడు దేశం అంతా గొప్పగా మాట్లాడుతుంది.

కొత్తగా చేస్తున్న సినిమాలు ? 
నాగార్జున గారితో ఘోస్ట్ సినిమా చేస్తున్నా. ఇందులో నాది ఫుల్ యాక్షన్ రోల్.

చదవండి: ప్రముఖ సీరియల్‌ నటి ఇల్లు చూశారా? ఎంత బాగుందో!

 25 సవర్ల బంగారాన్ని వాడుకున్నారు, కూతురిని చంపేశారు: మోడల్‌ తల్లి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement