
పటాస్‌తో దర్శకుడిగా కెరీర్ ఆరంభించాడు అనిల్ రావిపూడి. ఇప్పటిదాకా తీసిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అవుతూనే వచ్చింది. అపజయం అనేదే తెలియని ఈ డైరెక్టర్ ఇటీవలే ఎఫ్ 3తో మరో సక్సెస్ అందుకున్నాడు. అయితే ఈ సినిమా చిత్రీకరణ సమయంలో అనిల్‌కు, హీరోయిన్ తమన్నాకు మధ్య గొడవలు జరిగాయంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. అందుకే తమన్నా ఎఫ్ 3 ప్రమోషన్స్‌కు కూడా రాలేదని వార్తలు వెలువడ్డాయి.
తాజాగా దీనిపై అనిల్ స్పందిస్తూ.. 'ఎక్కువమంది ఆర్టిస్టులతో పని చేసినప్పుడు చిన్నచిన్న సమస్యలు ఎదురవుతుంటాయి. తమన్నాది పెద్ద గొడవేం కాదు. ఒకరోజు రాత్రి షూటింగ్ ఇంకాస్త పొడిగించాల్సి వచ్చింది. దానికామె పొద్దున్నే జిమ్ చేసుకోవాలి, టైం లేదు, వెళ్లిపోవాలి అని మాట్లాడింది.
అలా రెండురోజులు మా మధ్య కొంత హీట్ నడిచింది. ఆ తర్వాత మళ్లీ ఎప్పటిలాగే మాట్లాడుకున్నాం. వేరే సినిమా షూటింగ్స్‌లో ఉండటం వల్ల తను ప్రమోషన్స్‌కు రాలేకపోయింది' అని చెప్పుకొచ్చాడు. కొంత సమయం తీసుకున్నా సరే ఎఫ్ 4 చేస్తానన్నాడు అనిల్ రావిపూడి. కాగా మే 27న రిలీజైన ఎఫ్ 3 సినిమా 9 రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ సాధించింది.
చదవండి: అల్లు అర్జున్‌కి మహేశ్ బాబు థ్యాంక్స్.. చాలా హ్యాపీగా ఉందంటూ ట్వీట్
అమ్మ ముందే అలా చేశాడు, వర్జినిటీ కోల్పోయా: నటి
Comments
Please login to add a commentAdd a comment