Mega 154 Latest Update: Venkatesh To Make Guest Appearance In Chiranjeevi Bobby Movie - Sakshi
Sakshi News home page

Venkatesh In Chiranjeevi Movie: చిరుతో సరదా సన్నివేశంలో వెంకటేశ్‌? ఏ సినిమాలో అంటే..!

Published Mon, Sep 12 2022 3:49 PM | Last Updated on Mon, Sep 12 2022 4:58 PM

Victory Venkatesh Guest Appearance In Chiranjeevi, Bobby Movie - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఒకటి. ఈ మూవీకి వాల్తేర్‌ వీరయ్య అనే టైటిల్‌ను పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈచిత్రంలో ఈ సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఓ కీలక పాత్రను రవితేజ పోషిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్‌ను శరవేగంగా జరపుకుంటున్న ఈచిత్రం నుంచి తాజాగా ఓ క్రేజీ అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేశ్‌ కూడా భాగం కానున్నారట. ఇందులో ఆయన ఓ అతిథి పాత్ర పోషిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన రజనీకాంత్‌ కూతురు

మెగాస్టార్ తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా వెంకీ ఈ సినిమాలోని ఒక సరదా సందర్భంలో మెరవడానికి ఓకే చెప్పారని అంటున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వెలువడనుందట. మరి వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా వెంకటేశ్‌ ఈ చిత్రంలో నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నప్పటి నుంచి మెగా ఫ్యాన్స్‌తో పాటు దగ్గుబాటి అభిమానులు సంబరాలు చేసుకుంటారు. అంతేకాదు వెంకి చేస్తున్న సీన్‌పై రకరకాలు చర్చించుకుంటున్నారు. తనదైన నటన, కామెడీ టచ్‌తో నవ్వించే వెంకటేశ్‌తో సరదా సన్నివేశం అంటే మామూలు ఉండదని, ఆ సీన్‌ నెక్ట్‌ లెవల్లో ప్లాన్‌ చేసింటారంటూ నెట్టింట నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా దేవిశ్రీ ప్రసాద్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement