మంత్రి-మధ్యతరగతి యువతి లవ్ స్టోరీ | Venkatesh, Nayantara team up for the third time for Radha | Sakshi

మంత్రి-మధ్యతరగతి యువతి లవ్ స్టోరీ

Published Fri, Dec 27 2013 8:28 PM | Last Updated on Thu, Sep 27 2018 8:49 PM

మంత్రి-మధ్యతరగతి యువతి లవ్ స్టోరీ - Sakshi

మంత్రి-మధ్యతరగతి యువతి లవ్ స్టోరీ

విక్టరీ వెంకటేష్తో నయనతార ముచ్చటగా మూడోసారి జత కట్టనుంది. లక్ష్మీ, తులసీ సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించారు.

చెన్నై: విక్టరీ వెంకటేష్తో నయనతార ముచ్చటగా మూడోసారి జత కట్టనుంది. లక్ష్మీ, తులసీ సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. తాజాగా తెరకెక్కనున్న 'రాధ' సినిమాలో వెంకీ సరసన హీరోయిన్గా నయన్ నటించనుంది. వరుస విజయాలతో మంచి ఊపు మీదున్న దర్శకుడు మారుతి ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. జనవరి 16న షూటింగ్ ప్రారంభం కానుంది.

మంత్రికి,  మధ్యతరగతి యువతికి మధ్య చిగురించిన ప్రేమకథ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని నిర్మాతలు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు. వెంకటేష్-నయనతార హిట్ ఫెయిర్ మరోసారి రిఫీట్ అవుతుండడంతో 'రాధ' కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీరిద్దరూ నటించిన సినిమా టైటిల్స్ ఆడవారి పేర్లే కావడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement