Venkatesh Daughter Aashritha Comment On Samantha Post Goes Viral - Sakshi
Sakshi News home page

Venkatesh Daughter Aashritha: సమంత హాట్‌ ఫొటోపై దగ్గుబాటి వారసురాలు స్పందన

Published Sat, Mar 12 2022 12:16 PM | Last Updated on Sat, Mar 12 2022 1:56 PM

Venkatesh Daughter Aashritha Comment On Samantha Latest Post Goes Viral - Sakshi

విడాకుల అనంతరం స్టార్‌ హీరోయిన్‌ సమంత మరింత బిజీ అయిపోయింది. వరస సినిమా ఆఫర్లు, స్పెషల్‌ సాంగ్స్‌, కమర్షియల్‌ యాడ్స్‌ అటూ బిజినెస్‌ వ్యవహరాలు చూసుకుంటూ ఇలా రెండు చేతులా సంపాదిస్తోంది. వీలు చిక్కినప్పుడల్లా హాట్‌హాట్‌ ఫోజులు, దుస్తులతో సమంత తరచూ ఫొటోషూట్స్‌ చేస్తోంది. అంతేకాదు వీటిని సోషల్‌ మీడియాల్లో సైతం షేర్‌ చేస్తుంది. దీంతో ఆమెపై నెగిటివి పెరిగి తరచూ ట్రోల్స్‌ ఎదుర్కొంటోంది. అయినా ఇవేవి పట్టించుకోను అంటూ తన పని తాను చేసుకుంటు పోతోంది సామ్‌.

చదవండి: ఓటీటీలోకి అజిత్‌ ‘వలిమై’, స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..

ఇదిలా ఉంటే ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్‌ సిరీస్‌తో సామ్‌ ఎంతటి వ్యతిరేకతను మూట గట్టుగుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చెప్పాలంటే ఈ మూవీ వివాదమే ఆమె విడాకులకు దారి తీసిందని కొందరు మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే క్రిటిక్స్ చాయిస్ ఫిల్మ్ అవార్డుకు ఎన్నికైంది. ముంబైలో జరిగిన ఈ అవార్డు ఫంక్షన్‌కు సామ్‌ హజరైంది. ఈ కార్యక్రమానికి ఆమె ఎమరాల్డ్ గ్రీన్, నలుపు రంగు డ్రెస్సులో తళుక్కున మెరిసింది. కొత్త అందంతో అందరినీ కట్టిపడేసింది. ఆ ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో ‘నాకు అత్యంత ఇష్టమైన లుక్‌ ఇదే’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది.

చదవండి: లైవ్‌లో ఎక్స్‌లవ్‌, బ్రేకప్‌పై ప్రశ్న, రష్మిక ఏం చెప్పిందంటే..

దీనికి నెటిజన్లు, ఫ్యాన్స్‌ మాత్రమే కాకుండా పలువురు సెలబ్రెటీల నుంచి కూడా కామెంట్స్‌ వస్తున్నాయి. ఈ క్రమంలో సమంత పోస్ట్‌పై విక్టరి వెంకటేశ్‌, నాగచైతన్య మేనమామ పెద్ద కుమార్తె దగ్గుబాటి ఆశ్రిత సైతం స్పందించింది. హాట్‌ లుక్‌లో కనిపిస్తోన్న సామ్‌ పోస్ట్‌కు ఆశ్రిత ‘ముచ్చటేస్తోంది’ అంటూ లవ్‌ సింబల్‌తో ఉన్న ఏమోజీని జత చేసింది.  ఫుడ్ లవర్ అయిన ఆమె ఇన్ఫినిటీ ప్లాటర్ పేరిట ఇన్ స్టాగ్రామ్ ఖాతాను రన్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆశ్రితతో పాటు హీరోయిన్లు రష్మిక మందన్నా, సంయుక్త హెగ్డే, రుహానీ శర్మ, హన్సికలు సమంత పోస్ట్‌పై స్పందించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement