సైలెంట్‌గా హీరో వెంకటేశ్‌ కూతురి ఎంగేజ్‌మెంట్‌.. ఫోటో వైరల్‌ | Actor Daggubati Venkatesh Second Daughter Hayavahini Engagement Photos Trending On Social Media - Sakshi
Sakshi News home page

Actor Venkatesh Daughter Engagement: వెంకటేశ్‌ కూతురి నిశ్చితార్థం.. చిరంజీవి, మహేశ్‌ బాబు హాజరు

Oct 26 2023 9:51 AM | Updated on Oct 26 2023 10:57 AM

Daggubati Venkatesh Daughter Engagement Photo Goes Viral - Sakshi

మొదటి నుంచి వెంకటేశ్‌ సోషల్‌ మీడియాకు దూరంగానే ఉంటూ వస్తున్నాడు. తన ఫ్యామిలీ వ్యవహారాలను ప్రైవేట్‌గా ఉంచడానికే ఇష్టపడతాడు. అందుకే ఇప్పుడు తన కూతురి ఎం

విక్టరీ వెంకటేశ్‌ ఇంట పెళ్లి సందడి మొదలైంది. వెంకటేశ్‌- నీరజల రెండో కూతురు హయవాహిని పెళ్లి పీటలెక్కనుందంటూ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే కదా! తాజాగా అదే నిజమైంది. బుధవారం రాత్రి హవ్యవాహిని నిశ్చితార్థం జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుకకు మెగాస్టార్‌ చిరంజీవి, సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు సహా పలువురు సెలబ్రిటీలు హాజరైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు కొన్ని ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

సైలెంట్‌గా కానిచ్చేసిన ఎంగేజ్‌మెంట్‌
ఇకపోతే పెద్దగా ప్రచారం, హడావుడి లేకుండా సైలెంట్‌గా ఈ నిశ్చితార్థాన్ని పూర్తి చేశారు. కాగా మొదటి నుంచి వెంకటేశ్‌ సోషల్‌ మీడియాకు దూరంగానే ఉంటూ వస్తున్నాడు. తన ఫ్యామిలీ వ్యవహారాలను ప్రైవేట్‌గా ఉంచడానికే ఇష్టపడతాడు. అందుకే ఇప్పుడు తన కూతురి ఎంగేజ్‌మెంట్‌ విషయాన్ని సైతం మీడియాకు తెలియనివ్వకుండా జాగ్రత్తపడ్డాడు. అయినప్పటికీ ఈ నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. విజయవాడకు చెందిన డాక్టర్‌ ఫ్యామిలీతో వియ్యం అందుకుంటున్న వెంకటేశ్‌ వచ్చే ఏడాది మార్చిలో కూతురి వివాహం జరిపించనున్నట్లు తెలుస్తోంది.

సినిమాల సంగతేంటంటే..
వెంకీ మామ ప్రస్తుతం సైంధవ్‌ సినిమా చేస్తున్నాడు. ఇది ఆయన కెరీర్‌లో 75వ చిత్రం. శైలేష్‌ కొలను దర్శకత్వం వహించిన ఈ మూవీలో నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెరెమియా, సారా కీలక పాత్రల్లో నటించారు. నిహారిక ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై వెంకట్‌ బోయనపల్లి నిర్మించిన ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో జనవరి 13న విడుదల కానుంది. 

👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: రూమర్స్‌పై స్పందించిన సంపూర్ణేశ్‌ బాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement