పవన్‌తో సినిమా... రానా స్పందన | Rana Daggubati Speaks About Ayyappanum Koshiyum Remake | Sakshi
Sakshi News home page

పవన్‌తో సినిమాపై రానా స్పందన

Published Mon, Nov 9 2020 4:14 PM | Last Updated on Mon, Nov 9 2020 6:02 PM

Rana Daggubati Speaks About Ayyappanum Koshiyum Remake - Sakshi

పెళ్లి అనంతరం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు హీరో దగ్గుబాటి రానా. ఆయన నటించిన అరణ్య చిత్రం ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు ప్రభు సోలోమాన్‌ దర్శకత్వం వహించారు. అదే విధంగా విరాటపర్వం సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి, నందితా దాస్‌, ప్రియమణి ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఇదిలా ఉండగా రానాకు సంబంధించిన మరో వార్త టాలీవుడ్‌ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. కోలీవుడ్‌ సూపర్‌హిట్‌ సాధించిన అయ్యప్పన్‌ కొషియమ్’ సినిమాలో పవన్‌ కల్యాణ్‌ ప్రధాన పాత్రల్లో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో మరో లీడ్‌ రోల్‌ కోసం రానాను సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో బిజు మేనన్‌ పోషించిన పాత్రలో పవన్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ పోషించిన పాత్రలో రానా కనిపించనున్నారని సమాచారం. కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. చదవండి: రానా- మిహికల కర్వాచౌత్‌ ..

దీనిపై తాజాగా ఈ వార్తలపై రానా స్పందించారు. తనను సంప్రదించినట్లు పేర్కొన్నారు. ‘అవును ఈ సినిమాలోని పాత్ర కోసం నన్ను సంప్రదించారు. కానీ దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. వాస్తవానికి ఈ సినిమాలో నటించేందుకు చాలా ఆసక్తిగా ఉంది’ అని తెలిపారు. అదే విధంగా బాబాయి వెంకటేష్‌, రానా కలయికలో ఓ సినిమా రూపొందుతున్నట్లు వస్తున్న వదంతులపై ఆయన స్పందించారు. వెంకటేష్‌తో కలిసి సినిమా చేయనున్నటు క్లారిటీ ఇచ్చాడు. బాబాయ్‌తో కలిసి ఒక సినిమా చేయాలని చాలా కాలం నుంచి వేచి చూస్తున్నట్లు తెలిపారు. సరైన కథ దొరికిందని, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి సమాచారం వచ్చే ఏడాదిలో వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సినిమా చేయడం ఆనందంగా ఉందన్నారు. అంతేగాక ఇటీవల బాబాయి ఆరణ్య సినిమా బిట్స్‌ చూశారని, మొదటి సారి బాగుందని మెచ్చుకున్నారని అన్నారు. కాగా ఈ సినిమాను రానా తండ్రి సురేష్‌ బాబు తెరకెక్కించనున్నట్లు సమాచారం.  చదవండి: సాయి పల్లవికి బంఫర్‌ ఆఫర్..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement