![Nampally Court Orders To File case Against Daggubati Rana Suresh On Deccan Kitchen Issue - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/29/deccan-kitchen.jpg.webp?itok=uQNetDoa)
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ హీరోలు దగ్గుబాటి వెంకటేష్, రానాలకు నాంపల్లి కోర్టు షాకిచ్చింది. ఫిలింనగర్ డెక్కన్ కిచెన్ కూల్చివేత కేసులో దగ్గుబాటి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దగ్గుబాటి వెంకటేష్, సురేష్, రానా, అభిరామ్‌లపై కేసు నమోదు చేయాలని పోలీసులకు నాంపల్లి క్రిమినల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కాగా డెక్కన్ కిచెన్ యజమాని నందకుమార్ ఇచ్చిన ఫిర్యాదుపై నాంపల్లి కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించి దగ్గుబాటి ఫ్యామిలీ డెక్కన్ కిచెన్ కూల్చివేతకు పాల్పడ్డారని నంద కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కోట్ల రూపాయల విలువైన బిల్డింగ్‌ను ధ్వంసం చేసి, ఫర్చిచర్ ఎత్తుకెళ్లారని ఫిర్యాదులో ఆరోపించారు.
లీజు విషయంలో తనకు కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అక్రమంగా కూల్చివేశారని పేర్కొన్నారు. 60 మంది ప్రైవేట్ బౌన్సర్లను పెట్టుకుని హోటల్‌ను ధ్వంసం చేశారని అన్నారు. దీనివల్ల తనకు రూ. 20 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. ఈ క్రమంలో వెంకటేష్, ఇతర కుటుంబ సభ్యులపై IPC 448, 452,380, 506,120b కింద కేసులు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
చదవండి: 24 మంది ఎమ్మెల్యేల ఎన్నికపై పిటిషన్లు.. కేటీఆర్, హరీశ్ విజయంపై కూడా
Comments
Please login to add a commentAdd a comment