daggubati suresh babu
-
హీరో వెంకటేష్ పై కేసు నమోదు.. దగ్గుబాటి కుటుంబానికి నాంపల్లి కోర్ట్ షాక్
-
అలియా భట్ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్న ప్రముఖ నిర్మాత
బాలీవుడ్ టాప్ హీరోయిన్ అలియా భట్ నటించిన జిగ్రా సినిమా తెలుగులో కూడా విడుదల కానుంది. ఈమేరకు తాజాగా ప్రకటన వెలువడింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో వేదాంగ్ రైనా కీలక పాత్ర పోషిస్తున్నాడు. వాసన్ బాలా దర్శకత్వం వహిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్, ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, అపూర్వ మెహతా, షహీన్ భట్, సౌమెన్ మిశ్రాతో పాటు ఆలియా భట్ కూడా పెట్టుబడులు పెట్టారు.జిగ్రా ట్రైలర్‌కు మంచి ఆధరణ రావడంతో తెలుగు నిర్మాతలు కూడా ఈ సినిమాపై మక్కువ చూపారని తెలుస్తోంది. ఈ క్రమంలో జిగ్రా తెలుగు వర్షన్ థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేశ్ ఎంటర్టైన్మెంట్ సంస్థ సొంతం చేసుకుంది. అక్టోబర్ 11న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని వారు విడుదల చేయనున్నారు. టాలీవుడ్లో మంచి గుర్తింపు ఉన్న దగ్గుబాటి సురేశ్, సునీల్ నారంగ్‌లకు చెందిన సంస్థ నుంచి ఈ సినిమా డిస్ట్రిబ్యూట్ చేస్తుండడంతో మూవీపై ఆసక్తి పెరిగింది. నేడు సెప్టెంబర్ 29న తెలుగు ట్రైలర్ విడుదల కానుంది.జిగ్రా సినిమాలో భారీ యాక్షన్‌తో కూడిన స్టంట్స్ కూడా ఆలియా భట్ చేశారు. తన తమ్ముడిని రక్షించుకునేందుకు ఆమే చేసిన సాహసం ఎలాంటిదో ఈ చిత్రంలో దర్శకుడు చూపించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌పై చాలామంది బాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. -
హీరో వెంకటేష్, రానాలపై కేసు నమోదుకు నాంపల్లి కోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ హీరోలు దగ్గుబాటి వెంకటేష్, రానాలకు నాంపల్లి కోర్టు షాకిచ్చింది. ఫిలింనగర్ డెక్కన్ కిచెన్ కూల్చివేత కేసులో దగ్గుబాటి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దగ్గుబాటి వెంకటేష్, సురేష్, రానా, అభిరామ్లపై కేసు నమోదు చేయాలని పోలీసులకు నాంపల్లి క్రిమినల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా డెక్కన్ కిచెన్ యజమాని నందకుమార్ ఇచ్చిన ఫిర్యాదుపై నాంపల్లి కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించి దగ్గుబాటి ఫ్యామిలీ డెక్కన్ కిచెన్ కూల్చివేతకు పాల్పడ్డారని నంద కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కోట్ల రూపాయల విలువైన బిల్డింగ్‌ను ధ్వంసం చేసి, ఫర్చిచర్ ఎత్తుకెళ్లారని ఫిర్యాదులో ఆరోపించారు. లీజు విషయంలో తనకు కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అక్రమంగా కూల్చివేశారని పేర్కొన్నారు. 60 మంది ప్రైవేట్ బౌన్సర్లను పెట్టుకుని హోటల్‌ను ధ్వంసం చేశారని అన్నారు. దీనివల్ల తనకు రూ. 20 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. ఈ క్రమంలో వెంకటేష్, ఇతర కుటుంబ సభ్యులపై IPC 448, 452,380, 506,120b కింద కేసులు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. చదవండి: 24 మంది ఎమ్మెల్యేల ఎన్నికపై పిటిషన్లు.. కేటీఆర్, హరీశ్ విజయంపై కూడా -
నాకు నా తమ్ముడికి ఇప్పటివరకు డబ్బులు బేధం రాలేదు
-
దగ్గుబాటి ఇంట పెళ్లి సందడి.. ఆ రోజే రానా తమ్ముడి వివాహం!
ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు ఇంట పెళ్లిసందడి షురూ కానుంది. సురేశ్ బాబు రెండో తనయుడు, హీరో అభిరామ్ పెళ్లి ఖరారైనట్లు తెలుస్తోంది. ఇంతకీ పెళ్లి కూతురు ఎవరనుకుంటున్నారా? వాళ్ల బంధువులమ్మాయే! దివంగత నిర్మాత రామానాయుడి తమ్ముడి మనవరాలినే అభిరామ్ పెళ్లాడబోతున్నాడట! అంటే సురేశ్‌బాబు చెల్లెలి కూతురితోనే అభిరామ్ జీవితాన్ని పంచుకోనున్నాడన్నమాట! ఆమె కుటుంబం కారంచేడులో ఉంటోంది. రామానాయుడు కోరిక కూడా ఇదే! అభిరామ్, ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి ఒకరికొకరు ఇష్టపడుతున్నారని, వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు పచ్చజెండా ఊపాయని సమాచారం. దివంగత రామానాయుడు కోరిక కూడా ఇదేనని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అభిరామ్ పెళ్లి ఇండియాలో జరగడం లేదట! శ్రీలంకలో గ్రాండ్‌గా, స్పెషల్‌గా పెళ్లి చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి. డిసెంబర్ 6న ఈ పెళ్లి జరగనున్నట్లు సమాచారం. ఇందుకోసం శుభలేఖలు కూడా వినూత్నంగా డిజైన్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. కారంచేడులో రామానాయుడు ఉన్న పాత ఇల్లు డిజైన్‌ను శుభలేఖల మీద అచ్చువేయిస్తున్నారట. ఆ పనిలో ఉన్న అభిరామ్ ఇకపోతే దగ్గుబాటి అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన మూవీ అహింస. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర రాణించలేకపోయింది. ప్రస్తుతం అభిరామ్ ఒక కాఫీ షాపును ఓపెన్ చేసే పనిలో ఉన్నాడు. రామానాయుడు స్టూడియో పక్కనే రైటర్స్ కాఫీ షాప్ పేరిట షాపు ఓపెన్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అభిరామ్ అన్నయ్య రానా పెళ్లి 2020లో మిహికా బజాజ్‌తో జరిగింది. ఇప్పుడు అభిరామ్ కూడా పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు కాబోతుండటంతో అభిమానులు ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చదవండి: టైం ట్రావెల్ మూవీ.. రెండు నెలలు ఆలస్యంగా ఓటీటీలోకి! -
నెక్ట్స్ మహానటి ఎవరు? ఆ స్టార్ హీరోయిన్ పేరు చెప్పిన అగ్ర నిర్మాతలు
నందమూరి నట సింహం బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్ స్టాపబుల్-2’. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షో 5 ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. ఇటీవల ఈ జరిగిన ఈ టాక్ షోకు లేటెస్ట్ ఎపిసోడ్‌కు ఇద్దరు అగ్ర నిర్మాతలు అతిథులు వచ్చి సందడి చేశారు. దివంగత నటులు, మాజీ సీఎం నందమూరి తారకరామారావు(సీనియర్ ఎన్టీఆర్) శత జయంతి సందర్భంగా అన్‌స్టాబుల్ స్పెషల్ ఎపిసోడ్‌ను నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఈ షో స్పెషల్ గెస్ట్లుగా టాలీవుడ్ బడా నిర్మాతలు అల్లు అరవింద్, దగ్గుబాటి సురేశ్ బాబు.. దర్శకుడు రాఘవేంద్రరావు అతిథులుగా విచ్చేశారు.ఈ సందర్భంగా షోలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ప్రస్తుత జనరేషన్లో హీరోయిన్లలో మహానటి ఎవరంటూ బాలయ్య.. అల్లు అరవింద్, సురేశ్ బాబులను ప్రశ్నించాడు. దీనికి వీరద్దరు ఇచ్చిన సమాధానం ఆసక్తిని సంతరించుకుంది. అనుకొకుండానే ఇద్దరు నిర్మాతల ఒకే హీరోయిన్ పేరు చెప్పడం విశేషం. నెక్ట్స్ మహానటి ఎవరని అడగ్గానే వీరిద్దరు పలకపై సమంత పేరు రాశారు. సురేశ్ బాబు సమంత అనే సమాధానం చెప్పగానే అల్లు అరవింద్ కూడా తాను అదే పేరు రాశానని చెప్పారు. ఇప్పుడు ఉన్న వాళ్లలో మహానటి అవగలిగితే సమంత అనే సురేశ్ బాబు తన అభిప్రాయం చెప్పారు. దీంతో ఈ వీడియోను సమంత ఫ్యాన్స్ పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో వైరల్ చేస్తున్నారు. సమంత ఫ్యాన్‌క్లబ్ ట్విటర్ పేజీలో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా మహానటి సావిత్రి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. భారతీయ సినీ పరిశ్రమలో మహానటి సావిత్రి చెరగని ముద్ర వేసుకున్నారు. తన సినీ కెరీర్, వ్యక్తిగత జీవితం ఓ చరిత్రగా నిలిచింది. ఆమె తర్వాత మళ్ళీ అలాంటి మహానటి రారు, రాలేరు అని అంటారు. అంతలా తన నటనతో కట్టిపడేశారు ఆమె. ఆమె తరువాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్న నటి సౌందర్య అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. నటన పరంగా, వ్యక్తిత్వం పరంగా సౌందర్య ఇండస్ట్రీలో, అభిమానుల్లో మంచి ఆదరణ పొందారు. సావిత్రి తర్వాత సావిత్రి అనేలా సౌందర్య అద్భుతమైన నటనతో తెలుగు వారి హృదయాలను గెలుచుకున్నారు. ఇప్పుడు ఈ జనరేషన్లో సమంతను మహానటిగా ఇద్దరు అగ్ర నిర్మాతలు పేర్కొనడంతో ఆమె ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. Coming from both legendary producers of the industry at the same time ❤️ #Mahanati #Samantha 😍🤩 its all your dedication and hardwork angel 🙇 @Samanthaprabhu2 You earned it 💪 and you deserve it 🫶 #SamanthaRuthPrabhu pic.twitter.com/J6otq5o9pf — Samantha Fans (@SamanthaPrabuFC) December 3, 2022 -
ఇండిగో ఎయిర్ లైన్స్ పై నటుడు దగ్గుబాటి రానా ఆగ్రహం
-
దగ్గుబాటి వారసుడి చెంప పగలగొట్టిన డైరెక్టర్ తేజ
-
ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ ఎన్నికల్లో ఆదిశేషగిరిరావు ఘన విజయం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ క్లబ్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రముఖ నిర్మాత ఆదిశేషగిరిరావు మరోసారి ఎఫ్ఎన్సీసీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసిన నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌పై తుమ్మల రంగారావు విజయం సాధించారు. ప్రతీ రెండేళ్లకోసారి ఫిల్మ్ నగర్ క్లబ్‌కు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటారు. మొత్తం 4 వేల 600మంది సభ్యులున్న ఈ సెంటర్లో 1900 మందికి ఓటు హక్కు ఉంది. వారిలో మెజార్టీ సభ్యులైన నిర్మాతలు, దర్శకులు, ఇతర ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అల్లుఅరవింద్ , సురేష్ బాబు, కేఎల్ నారాయణ ప్యానెల్‌లోని సభ్యులే గెలుపొందారు. చదవండి: (డాటర్స్ డే స్పెషల్.. కూతురికి మహేశ్ స్పెషల్ విషెష్) -
వెంకటేశ్, సురేశ్‌బాబు మోసం చేశారు
సాక్షి, హైదరాబాద్(యాకుత్‌పురా): సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్ తనకు అమ్మిన భూమిని ఆయన కొడుకు రానా పేరున రిజిస్ట్రేషన్ చేశారంటూ సదరన్ స్పైసిస్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ నందకుమార్ ఆరోపించారు. ఆయన మంగళవారం పురానీ హవేలీలోని సిటీసివిల్ కోర్టు ఎదుట మీడియాతో మాట్లాడారు. ఫిలింనగర్లో తనకు అగ్రిమెంట్ చేసిన భూమిని తనతో పాటు మరొకరికి కూడా అగ్రిమెంట్ చేసి మోసం చేశారని ఆరోపించారు. (చదవండి: ఓటీటీలో వచ్చేస్తున్న ‘రాకెట్రీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..) కోర్టు ఆదేశాలను సైతం లెక్కచేయకుండా రానా పేరున రిజిస్ట్రేషన్ చేశారనన్నారు. సినీ నటుడు వెంకటేశ్ సైతం 1200 గజాల భూమిని తనకు లీజ్ అగ్రిమెంట్ చేశారని నందకుమార్ తెలిపారు. సదరు స్థలం నుంచి బలవంతంగా తనను ఖాళీ చేయించేందుకు దగ్గుపాటి కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాగా.. రానా హాజరు కాకపోవడంతో విచారణను ఆగస్టు 2కు కోర్టు వాయిదా వేసింది. -
‘దృశ్యం 2’ థియేటర్లో విడుదల చేసినా ఈ రేటింగే వచ్చేది కానీ...: సురేశ్ బాబు
విక్టరీ వెంకటేష్ హీరోగా, జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన దృశ్యం 2 చిత్రాన్ని ఆంటోని పెరంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి, సురేష్ బాబు కలిసి సురేష్ ప్రొడక్షన్స్, రాజ్ కుమార్ థియేటర్స్ అండ్ మ్యాక్స్ మూవీస్ బ్యానర్ల మీద సంయుక్తంగా నిర్మించారు. సూపర్ హిట్ థ్రిల్లర్ దృశ్యం సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం నవంబర్ 25న విడుదలైంది. సినిమా సక్సెస్ అవ్వడంతో నిర్మాత సురేష్ బాబు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► దృశ్యం 2 మళయాలంలో మంచి హిట్ అయింది. వెంటనే రైట్స్ తీసుకున్నాం. జీతూ జోసెఫ్‌ను స్క్రిప్ట్ పంపించమని అడిగాను. కొన్ని మార్పులు చేర్పులు సూచించాను. అలా మొత్తానికి స్క్రిప్ట్ పూర్తయింది. వెంటనే షూటింగ్ ప్రారంభించారు. ఈ సినిమా అంత త్వరగా ఏ చిత్రాన్ని పూర్తి చేయలేదు. హైద్రాబాద్, కేరళలో షూట్ చేశాం. కరోనా భయంతో నేను మాత్రం సెట్‌కు వెళ్లలేదు. కానీ మా వాళ్లతో మాత్రం పని చేయించాను. ►దృశ్యం 2 అనేది కమర్షియల్ సినిమా కాదు, పాటలు, ఫైట్లు ఉండే సినిమాలను థియేటర్లో చూస్తే మంచి కిక్ వస్తుంది. దృశ్యం 2ను థియేటర్లో విడుదల చేసినా కూడా ఈ రేటింగ్ వచ్చేది. కానీ కలెక్షన్లు ఎంత వస్తాయనేది చెప్పలేం. ఓటీటీ అనేది ఫైనాన్షియల్‌గా సేఫ్ అవుతుంది. ఇప్పుడు ఓటీటీ, యూట్యూబ్ వంటి వాటి వల్ల కొత్త టాలెంట్ కూడా వస్తోంది. టాలెంట్ ఉన్న ప్రతీ ఒక్కరూ సినిమాను తీయగలుగుతున్నారు. ► థియేటర్లో చూస్తే వచ్చే ఎక్స్పీరియన్స్ వేరు. కానీ ఆడియెన్స్ టేస్ట్ మారిపోతోంది. అఖండ, పుష్ప వంటి చిత్రాలకు ఆడియెన్స్ కచ్చితంగా వస్తారు. ► పండుగలకు జనాలు థియేటర్లకు వస్తున్నారని అందరికీ అర్థమైంది. అందుకే ఫెస్టివల్ సీజన్‌కు రావాలని ఫిక్స్ అయ్యారు. ఒకప్పుడు నాలుగు సినిమాలు వచ్చేవి. నాలుగు వందల థియేటర్ల చొప్పున నాలుగు చిత్రాలు సంక్రాంతికి విడుదలయ్యేవి. కానీ ఇప్పుడు ఒక్కో సినిమాకు 1500 స్క్రీన్స్ కావాలని అంటున్నారు. అక్కడే గొడవ వస్తోంది. చూడాలి ఈ సంక్రాంతికి ఎలా ఉంటుందో.. ► నేను ఈ సినిమా ఇండస్ట్రీలో పుట్టాను. పెరిగాను. నేను ఏం చేసినా కూడా సినిమా పరిశ్రమ కోసమే చేస్తాను. నేను ఇక్కడ బిజినెస్ చేస్తున్నాను. నేను డబ్బు జనరేట్ చేయాలి. ప్రొడక్షన్ కంపెనీ నడపాలి. థియేటర్లను చూసుకోవాలి. అంతేకానీ ఎవరో ఏదో అన్నారని నేను పట్టించుకోను ► శాకిని డాకిని, దొంగలున్నారు జాగ్రత్త, డ్యాన్సింగ్ క్వీన్ అనే మూడు సినిమాలు ఓటీటీకి ఇచ్చేశాను. ఇంకా కొన్ని ప్రాజెక్ట్‌లు సెట్స్ మీదున్నాయి. వెంకటేష్ హీరోగా రానా నాయుడు, ఎఫ్ 3లు కాకుండా ఇంకొన్ని రెడీ అవుతున్నాయి. అవి రివిల్ చేశాక తప్పకుండా మీరు సర్ప్రైజ్ అవుతారు. ► విరాటపర్వం ఇంకా ఐదు రోజుల బ్యాలన్స్ షూటింగ్ ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎప్పుడు పూర్తవుతుందో తెలీదు. సినిమా, పాలిటిక్స్, స్పోర్ట్స్ అనే వాటిని డబ్బుతో కొలవొద్దు. మన హైద్రాబాద్‌ను దేశానికి సినీ రాజధాని చేసే విధంగా కేటీఆర్ గారు ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది. సినిమా అనేది ఎక్కువ కనిపిస్తుంది. మధ్యప్రదేశ్‌లో ఇప్పుడు ఎందుకు అంత సబ్సిడీ ఇస్తున్నారు.. యూపీ ఎందుకు ఇండస్ట్రీ కోసం ట్రై చేస్తోంది.. సినిమా వల్ల టూరిజం పెరుగుతుంది. డెవలప్మెంట్ జరుగుతుంది. సినిమా పరిశ్రమను డబ్బుతో కొలవొద్దు. -
సీఎం జగన్‌తో టాలీవుడ్ అగ్ర నిర్మాతల భేటీ
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తెలుగు సినీ పరిశ్రమ అగ్ర నిర్మాతలు భేటీ అయ్యారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేనివంశీతో పాటు నిర్మాతలు దగ్గుబాటి సురేష్, శ్యాంప్రసాద్‌రెడ్డిలతో పాటు జెమిని కిరణ్‌లతో కూడిన బృందం సీఎం జగన్‌ను క్యాంపు కార్యాలయంలో కలిసింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. హుద్‌హుద్ తుఫాను సమయంలో ఇళ్లు కోల్పోయిన బాధితుల కోసం సినీపరిశ్రమ సాయంతో 320 ఇళ్లు నిర్మించిన విషయాన్ని సీఎం దృష్టికి తీసుకొచ్చామన్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తయినందున వాటిని ప్రారంభించి హుద్‌హుద్ సమయంలో ఇళ్లు కోల్పోయిన వారికి అందించాలని విజ్ఞప్తి చేశామన్నారు. దీని కోసం తెలుగు సినీపరిశ్రమంతా రెండు రోజుల పాటు అన్ని కార్యక్రమాలు నిలిపివేసి, ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు టెలీథాన్ పేరుతో ప్రత్యేక షో నిర్వహించామని చెప్పారు. ఆ షో నిర్వహణ ద్వారా వచ్చిన రూ.15 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టామని చెప్పారు. ఆ ఇళ్ల నిర్మాణం ఇప్పుడు పూర్తైందని.. అదే విషయాన్ని ముఖ్యమంత్రికి వివరించామని చెప్పారు. పూర్తైన ఇళ్లను పేదలకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశామన్నారు. అందుకు సీఎం వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. చదవండి: విద్యుత్ రంగంలో పెట్టుబడులే లక్ష్యం: సీఎం జగన్ -
వెంకీ మామ : మూవీ రివ్యూ
-
వెంకీ మామ : మూవీ రివ్యూ
టైటిల్: వెంకీ మామ జానర్: ఫ్యామిలీ ఎంటర్టైనర్ నటీనటులు : వెంకటేశ్, నాగచైతన్య, రాశి ఖన్నా, పాయల్ రాజ్‌పుత్, నాజర్, రావు రమేశ్, ప్రకాశ్‌రాజ్, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, గీత, కిషోర్ సంగీతం : థమన్ సినిమాటోగ్రఫి: ప్రసాద్ మురేళ్ల దర్శకత్వం: బాబీ (కేఎస్ రవీంద్ర) నిర్మాతలు: సురేశ్‌బాబు, టీజీ విశ్వప్రసాద్ కొన్ని కాంబినేషన్ల కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు నటులు తెరమీద ఆడిపాడి.. అలరిస్తే చూడాలని కోరుకుంటారు. అలాంటి అరుదైన కాంబినేషన్ విక్టరీ వెంకటేశ్, యువసామ్రాట్ నాగచైతన్య. ఈ ఇద్దరూ రియల్‌లైఫ్‌లో మామ-అల్లులు. రీల్‌లైఫ్‌లోనూ అవే పాత్రలు వేస్తూ.. తెరమీదకు వస్తున్నారంటే సహజంగానే ఈ మల్టీస్టారర్ సినిమాపై మంచి క్రేజ్ ఉంటుంది. ‘గురు’, ఎఫ్-2 సినిమాలతో మంచి జోష్‌లో వెంకీ, ‘మజిలీ’ సూపర్‌హిట్ అందుకున్న చైతూ.. కలిసి నటించిన సినిమా ‘వెంకీ మామ’.. మరీ ఈ మామ అల్లుళ్లు తెరమీద చేసిన హంగామా ఏంటి? తమ అనుబంధంతో ప్రేక్షకులను ఏమేరకు కట్టిపడేశారు? తెలుసుకుందాం పదండి. కథ: రామనారాయణ (నాజర్) ప్రముఖ జ్యోతిష్యుడు. కానీ ఆయన కూతురు జాతకాలు పట్టించుకోకుండా ప్రేమవివాహం చేసుకుంటుంది. ఫలితంగా అన్నట్టు దంపతులిద్దరు రోడ్డు యాక్సిడెంట్లో చనిపోతారు. జాతకం దృష్ట్యా వారి ఏడాది కొడుకును చేరదీయడానికి రామనారాయణ నిరాకరిస్తాడు. జాతకాల కన్నా ప్రేమ గొప్పదని భావించే మేనమామ వెంకటరత్నం(వెంకటేశ్) ఆ చిన్నారిని ప్రేమగా చేరదీసి.. తాను పెళ్లికూడా చేసుకోకుండా పెంచి పెద్ద చేస్తాడు. మరోవైపు మామ కోసం లండన్‌లో మంచి ఉద్యోగాన్ని, ఆఖరికీ ప్రేమను కూడా తిరస్కరించడానికి కార్తీక్ (నాగచైతన్య) సిద్ధపడతాడు. ఈ క్రమంలో మామకు పెళ్లి చేయడానికి కార్తీక్.. కార్తీక్ ప్రేమించిన అమ్మాయిని మళ్లీ కలుపడానికి వెంకటరత్నం ప్రయత్నిస్తారు. కానీ, కార్తీక్ జాతక ప్రభావం వెంకటరత్నాన్ని వెంటాడుతుంది. ఈ క్రమంలో మామకు దూరంగా వెళ్లిపోయిన కార్తీక్ ఆర్మీలో మేజర్‌గా చేరుతాడు. తనకు దూరంగా ఉన్న కార్తీక్‌ను వెతుక్కుంటూ వెళ్లిన వెంకటరత్నం.. అక్కడ ఎలాంటి విషయాలు తెలుసుకున్నాడు. అసలు కార్తీక్‌కు ఎదురైన కష్టమేంటి? అతన్ని కాపాడేందుకు మామ చేసిన సాహసమేంటి? ఇది మిగతా కథ. నటీనటులు: సీనియర్ నటుడు వెంకటేశ్ తెరమీద కనిపిస్తేనే నవ్వులు విరబూస్తాయి. తన మ్యానరిజమ్స్, డైలాగ్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేయంలో దిట్ట ఆయన. మిలటరీ నాయుడు అలియాస్ వెంకటరత్నం పాత్రలో మరోసారి వెంకీ అదరగొట్టాడు. ఫస్టాఫ్ అంతా వెంకీ తన సహాజమైన కామెడీతో ఆకట్టుకున్నాడు. సెకండాఫ్‌లో గంభీరమైన పాత్రను అంతే అలవోకగా పోషించాడు. అల్లుడు కార్తీక్ పాత్రలో నాగచైతన్య తనదైనశైలిలో చక్కని అభినయం కనబర్చాడు. ‘మజిలీ’లో గంభీరమైన పాత్ర పోషించిన చైతూ.. ఈ సినిమాలో చలాకీ యువకుడిగా, మామకు తగ్గ అల్లుడిగా, ఆర్మీ మేజర్‌గా మెచ్యూర్డ్ ఫర్ఫార్మెన్స్ కనబర్చాడు. వెన్నెల, హారిక పాత్రల్లో పాయల్ రాజపుత్, రాశి కన్నా తమ పరిధి మేరకు నటించారు. సహజంగానే కామెడీ, పాటలు మినహా హీరోయిన్ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం లేదు. నాజర్, గీత, ప్రకాశ్ రాజ్, రావూ రమేశ్, కిషోర్, హైపర్ ఆది తమ పాత్రలతో మెప్పించారు. విశ్లేషణ: మామ-అల్లుళ్ల స్వచ్ఛమైన అనుబంధం.. జాతకాలరీత్యా వారి జీవితంలో ఎదురైన అనూహ్య కష్టాలు ఇది సినిమా కథ. కథ సింపుల్‌గా, రోటిన్‌గా అనిపించినా దర్శకుడు బాబీ స్క్రీన్‌ప్లేను ఆసక్తికరంగా తెరపై చూపించాడు. ఫస్టాప్ అంతా కామెడీతో ఎంటర్టైనర్గా మలిచాడు. ముఖ్యంగా వెంకీ మ్యానరిజమ్స్, డైలాగ్ డెలివరీతో తెరపై కామెడీ పండించాడు. వెంకీని రాశీ పొరపాటుగా భావించడం, అటు చైతూను కూడా పాయల్ అలాగే అనుకోవడం, హైపర్ ఆది, చమ్మక్ చంద్రలతో కలిసి వెంకీ, చైతూ పండించిన కామెడీ ప్రేక్షకులకు వినోదం పంచుతుంది. ఎమ్మెల్యే రావూ రమేశ్‌ను వెంకీ-చైతూ దీటుగా ఎదుర్కోవడం, చైతూ లవ్, బ్రేకప్ వంటి సీన్లతోపాటు కామెడీతో, పాటలతో ఫస్టాప్ వినోదాత్మకంగా సాగుతుంది. కానీ, సెకండాఫ్‌కు వచ్చేసరికి సినిమా గంభీరంగా మారిపోతోంది. జాతకాల ప్రభావం రీత్యా మామ-అల్లుళ్లు దూరం కావడం. చైతూ ఆర్మీలో చేరడం.. ఆ తదుపరి పరిణామాలు ఇవన్నీ సినిమాను గంభీరంగా నడిపిస్తాయి. ఈ సీన్లు బోర్ కొట్టకపోయినా.. సెకండాఫ్‌లో కొంత లాజిక్ తప్పిన విషయాన్ని ప్రేక్షకుడు గుర్తిస్తాడు. సెకండాఫ్ కొంత రోటీన్‌గా అనిపిస్తుంది. ప్రేక్షకుడి ఊహకు అందే సినిమాటిక్ క్లైమాక్స్ ఇవన్ని రోటిన్ ఫీలింగ్ కలిగించవచ్చు. ఈ కాలంలోనూ జాతకాలూ, వాటి ప్రభావాలను ఇంతగా నమ్మేవాళ్లు ఉంటారా? అంటే సినిమాలో వాటిని నమ్మించేరీతిలో కథను బలంగా చూపించడం కనిపిస్తుంది. ఇక, జాతకాలు, నమ్మకాల కన్నా మనిషి ప్రేమే గొప్పదన్న సందేశం చివర్లో దర్శకుడు ఇస్తాడు. ఏపీ నుంచి కథను అమాంతం కశ్మీర్‌కు తీసుకెళ్లి.. సర్జికల్ స్ట్రైక్స్ లాంటి సీన్లతో కొంత లాజిక్ తప్పినట్టు అనిపించినా.. దర్శకుడు బాబీ తాను అనుకున్న కథను చక్కగా తెరపై చూపించాడు. ప్రసాద్ మురేళ్ల సినిమాటోగ్రఫి బావుంది. కశ్మీర్ అందాలు, అక్కడ తెరకెక్కించిన సీన్లు బావున్నాయి. మిలటరీ నాయుడు పాటతో అదరగొట్టిన థమన్... నేపథ్య సంగీతంతో సినిమాకు ప్లస్ అయ్యాడు. డైలాగులు అక్కడక్కడా పేలాయి. సినిమాస్థాయికి తగ్గట్టు నిర్మాణ విలువలు ఉన్నాయి. మొత్తానికి తొలిసారి తెర పంచుకున్న వెంకీ-చైతూ.. ప్రేక్షకులతో సెక్సీ మామ-అల్లుళ్లు అనిపించుకుంటారు. బలాలు వెంకటేశ్, నాగచైతన్య నటన ఫస్టాప్, కామెడీ సినిమా నిర్మాణ విలువలు బలహీనతలు సెకండాఫ్ ఒకింత రోటిన్‌గా అనిపించడం సినిమాటిక్ క్లైమాక్స్ - శ్రీకాంత్ కాంటేకర్ -
టాలీవుడ్లో ఐటీ దాడుల కలకలం
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ అగ్ర నిర్మాత దగ్గుబాటి సురేశ్‌బాబు ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు బుధవారం దాడులు చేశారు. ఆయన కార్యాలయల్లోనూ ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. రామానాయుడు స్టూడియోతో పాటు, సురేశ్ ప్రొడక్షన్ కార్యాలయాల్లో తనిఖీలు జరుపుతున్నారు. సోదాల్లో పలు కీలక పత్రాలు లభ్యమయినట్టు తెలుస్తోంది. పన్నుల ఎగవేతకు సంబంధించి అధికారులు ఆరా తీస్తున్నారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో చిన్న సినిమాలను పెద్ద ఎత్తున సురేశ్‌బాబు పంపిణీ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పలు ధియేటర్లను కూడా సొంతంగా ఆయన నడిపిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం మైత్రి మూవీ మేకర్స్, దిల్ రాజు, కెఎల్ నారాయణ నివాసాలు, కార్యాలయాల్లోనూ ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. వరుస ఐటీ దాడులతో టాలీవుడ్ నిర్మాతలు కంగారుపడుతున్నారు. కాగా, గత నెలలో ప్రముఖ సినీ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ సినిమాస్ కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగాయి. సంస్థ అధినేతలు నారయణదాస్, సునీల్ నారంగ్‌ల ఇళ్లతో పాటు వారి సన్నిహితుల నివాసాలతో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. నైజాంలో భారీ చిత్రాలను పంపిణీ చేయటంతో పాటు, ఏషియన్ సినిమాస్ పేరిట థియేటర్స్‌ను కూడా ఈ సంస్థ నిర్మించింది. -
రామానాయుడు విగ్రహావిష్కరణ
మూవీ మొఘల్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత రామానాయుడు జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని ఫిల్మ్ చాంబర్ ఆవరణలో గురువారం ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రముఖ నిర్మాత, రామానాయుడు కుమారుడు దగ్గుబాటి సురేశ్‌బాబు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సినీ, రాజకీయ రంగాలకు రామానాయుడు అందించిన సేవలను అతిథులు కొనియాడారు. దర్శకుడు కె.రాఘవేంద్రరావు, నిర్మాత అల్లు అరవింద్, ఫిల్మ్‌నగర్ సొసైటీ అధ్యక్షులు జి. ఆదిశేషగిరిరావు, రచయితలు పరుచూరి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాలకృష్ణ, నటులు కైకాల సత్యనారాయణ, గిరిబాబు, కోట శ్రీనివాసరావు, ఆర్.నారాయణమూర్తి, విజయ్‌చందర్, శివకృష్ణ, కేఎల్ నారాయణ, ఎంపీ రఘురామ కృష్ణంరాజు, దర్శకుడు బి.గోపాల్, నిర్మాతలు సి.కల్యాణ్, అశోక్ కుమార్, బోయిన సుబ్బారావు, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ పాల్గొన్నారు. -
రవి మొండితనం నచ్చింది
‘‘ప్రయోగాత్మక సినిమాలను కంటిన్యూ చేస్తూనే ఉంటాను. అందుకే ‘పెళ్ళిచూపులు, కంచెరపాలెం’ వంటి డిఫరెంట్ సినిమాలకు సపోర్ట్ చేశాను. కొత్త ఫిల్మ్ మేకర్స్‌కు, కొత్త ఆలోచనలకు ఎవరో ఒకరు మద్దతుగా నిలవాలి. అప్పుడే ఇండస్ట్రీకి కొత్త టాలెంట్ వస్తుంటుంది’’ అన్నారు నిర్మాత సురేశ్‌బాబు. బంటి (పందిపిల్ల) ప్రధాన పాత్రలో రూపొందిన సినిమా ‘అదుగో’. రవిబాబు, అభిషేక్, నభా ముఖ్య పాత్రలు పోషించారు. ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ పతాకంపై రవిబాబు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్ర సమర్పకులు సురేశ్‌బాబు చెప్పిన విశేషాలు... ∙‘అదుగో’ సినిమా ఐడియాను రవిబాబు చెప్పినప్పుడు బాగా ఎగై్జట్ అయ్యాను. ఒక్క ‘సోగ్గాడు’ తప్ప మా కాంబినేషన్లో వచ్చిన సినిమాలు బాగానే ఆడాయి. ‘అదుగో’ చాలా కష్టమైన సినిమా. త్రీడీ యానిమేషన్లో చేయాలనుకున్నాం. చాలా డబ్బులు ఖర్చుపెట్టిన తర్వాత యానిమాట్రానిక్ పిగ్ (యానిమేషన్ పిగ్) వర్కౌట్ కాలేదు. అప్పుడు త్రీడీ ఆలోచన వచ్చింది. రవి బడ్జెట్‌ను కూడా దృష్టిలో పెట్టుకున్నాడు. అన్ని పనులను తను దగ్గరుండి చేశాడు... చేయించాడు కూడా. అందుకే క్రెడిట్ మొత్తం తనకే దక్కుతుంది. ఒక దశలో ఈ సినిమాను వదిలేద్దాం అన్నాను. నో సార్ అన్నాడు. రవి మొండితనం బాగా నచ్చింది. ∙ ఇందులో పంది, 3 కుక్కల ఫైట్ థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఈ సినిమాలో పిల్లుల చేజ్లు, పిగ్ రేస్‌లు ఉన్నాయి. సినిమాలో బంటి వల్ల రాజధాని భూముల రేట్లు పెరుగుతాయి. లోకల్ గూండాల పనులు తగ్గుతాయి. అవి ఎలా అనేది ఆసక్తికరంగా ఉంటుంది. పిల్లలకు బాగా నచ్చుతుందనుకుంటున్నాం. సీక్వెల్ ఆలోచనలు కూడా ఉన్నాయి. ∙ ‘అదుగో’ హిట్ సాధిస్తుందో లేదో తెలీదు. కానీ జానర్ నచ్చింది. లైవ్ యాక్షన్ యానిమేషన్‌ను నమ్మాను. ఈ టెక్నాలజీ గురించి రాజమౌళికి, శంకర్‌కి తెలుసు. ఈ ఇద్దరూ అవుటాఫ్ ది బాక్స్ ఆలోచిస్తారు.టెక్నికల్ స్టాండర్ట్స్‌ను పెంచుతున్నారు. ఎక్కువమంది ఇలా ఆలోచిస్తే మన సినిమా స్థాయి పెరుగుతుంది. ∙ మా నాన్నగారి (డి. రామానాయుడు) బయోపిక్ కోసం ఇద్దరు ముగ్గురు అడిగినా చేయాలనుకోవడం లేదు. ఓ రెజ్లర్ లైఫ్ ఆధారంగా సినిమా ప్లాన్ చేస్తున్నాం. రానా ‘హిరణ్య’ సినిమా వచ్చే ఏడాది మొదలవుతుంది. ఈ సినిమాకు లీడ్ ప్రొడ్యూసర్ కూడా రానానే. నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. నక్కిన త్రినా«థరావు, వెంకటేశ్ కాంబినేషన్లో ఓ మూవీ ఉంటుంది. తెలంగాణ లవ్‌స్టోరీ బ్యాక్‌డ్రాప్‌లో ‘దొరసాని’ సినిమా జరుగుతోంది. దర్శకుడు రవికాంత్ పేరెపుతో చేస్తున్న సినిమా తుది దశకు వచ్చింది. సమంత హీరోయిన్గా నందినీరెడ్డి దర్శకత్వంలో కొరియన్ రీమేక్ ‘మిస్ గ్రానీ’ ఉంది. ‘వెంకీమామ’ ఈ ఏడాదిలోనే స్టార్ట్ అవుతుంది. తరుణ్ భాస్కర్‌తో సినిమాలు ఉన్నాయి. ఆయన ఒక సినిమాను డైరెక్ట్ చేస్తారు. ఇంకో సినిమాకు కో–ప్రొడ్యూసర్. కొత్త అబ్బాయి నానితో నేనూ, రామ్మోహన్ ఓ సినిమా ప్లాన్ చేశాం. ‘కంచెరపాలెం’ నిర్మాత ప్రవీణతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నా. వేణు ఊడుగులతో ఓ సినిమా ఉంది. ఆయుష్మాన్ ఖురానా చేసిన హిందీ సినిమా ‘అందాథూన్’ బాగుందని, చూడమని సన్నిహితులు చెప్పారు. చూసి వస్తున్నప్పుడు సడన్‌గా నా కారు ఓ రాయిపై ఎక్కింది. టైర్ పగిలింది. ప్రమాదం జరిగింది. వెంటనే పోలీస్‌స్టేషన్‌కి వెళ్లాను. బ్రీత్ టెస్ట్ చేశారు. జీరో వచ్చింది. ప్రమాదం నా తప్పు కాదు. వెహికల్ మిస్టేక్ కూడా ఉంది. ఇందులో గాయపడినవాళ్లందరూ నార్మల్‌గా వచ్చే వరకూ నాదే బాధ్యత. -
దగ్గుబాటి సురేష్ బాబు కారు బీభత్సం
-
నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు కారు బీభత్సం
సాక్షి, సికింద్రాబాద్ : ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు కారు బీభత్సం సృష్టించింది. రాంగ్రూట్లో దూసుకెళ్లిన కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంపీరియల్ గార్డెన్ వద్ద రాంగ్ రూట్లో దూసుకెళ్లిన సురేష్‌బాబుకు చెందిన టీఎస్09ఈఎక్స్2628 నెంబరు గల కారు అటుగా వెళుతున్న ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఆ ద్విచక్రవాహనంపై వెళుతున్న దంపతులు సతీష్ చంద్ర(35), దుర్గ దేవి(30), సిద్దేశ్ చంద్ర(3)లు గాయపడ్డారు. స్థానికులు గాయపడ్డ ముగ్గురిని యశోద ఆసుపత్రికి తరలించారు. కార్ఖానా పోలీసులు ప్రమాదానికి కారణమైన దగ్గుబాటి సురేష్‌కు 41ఏ నోటీసులు ఇచ్చారు. -
ఫిరాయింపులతో ఓటరుకు అవమానం
మనసులో మాట కొమ్మినేని శ్రీనివాసరావుతో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు ఒక పార్టీ తరపున పోటీ చేసి గెలిచాక అవతలి పార్టీ ఏదైనా ఆశ చూపితే పార్టీ మారిపోవడం అంటే ఎన్నికల ద్వారా ఓటరు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగపర్చడమే అవుతుందని టాలీ వుడ్ ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్ పేర్కొన్నారు. జనం మీకు ఓటేసి గెలిపిస్తే ఆ పార్టీకే పనిచేయాలి కాని పార్టీలు మారిపోవడం విలువల రాహిత్యానికే నిదర్శనం అన్నారు. నమ్మి ఓటేసిన ఓటరును అగౌరవపర్చటం రాజకీయ నేతలకు అలవాటు అయిపోయిందని విమర్శించారు. ధూమపానం కానీ, మద్యం కానీ, డ్రగ్స్ కానీ సినిమాలు రాకముందునుంచే సమాజంలో ఉన్నాయి కానీ సినీ పరిశ్రమ వల్ల అవి పెరగలేదని, ఏరంగంలో అయినా క్రమశిక్షణకే కెరీర్ ఉంటుందని, క్రమశిక్షణారాహిత్యానికి ఉండదంటున్న దగ్గుబాటి అభిప్రాయాలు ఆయన మాటల్లోనే.. మీ తండ్రి రామానాయుడు బ్రాండ్‌కు తగినట్లుగానే మీరు ఎలా నడుస్తున్నారు? చిన్నప్పుడు నాన్న ఇంజనీరింగ్ చదువుకోమని చెబితే కోర్సు పూర్తి చేశాను. అమెరికా నుంచి తిరిగొచ్చి ఏదైనా పరిశ్రమ ఏర్పాటు చేయాలనుకున్నాను. కానీ పెట్టలేకపోయాము. ఆ సమయంలోనే దేవత సినిమా షూటింగ్ జరుగుతుంటే స్టూడియోలో చేరిపోయాను. దాంట్లో పుంజుకున్నాను. నాన్నకు సహాయంగా ఉండేవాడిని. డెవలప్మెంట్, డబ్బింగ్ స్టూడియోలు పెట్టడంలో పాలు పంచుకున్నాను. ఈలోగా వెంకటేశ్ చదువు ముగించి అమెరికా నుంచి తిరిగొచ్చాడు. తనతో తీసిన బొబ్బిలి రాజా వంటి కొన్ని సినిమాలు బాగా ఆడాయి. ఇక బయటకు వెళ్లాలనే కోరిక కూడా లేకుండా పోయింది. స్టూడియోలు, ల్యాబ్‌లు ఇలా సినీరంగంలోనే సెటిలైపోయాను. మీ తాజా సినిమా ‘నేనే రాజు నేనే మంత్రి’ గురించి చెబుతారా? ఇది జోగేంద్ర అనే సాధారణ వ్యక్తి కథ. ఈ సమాజంలో ఉండే చెడువల్ల తన భార్యకు జరిగిన అన్యాయం వల్ల అతడు ఎలా రాజకీయాల్లోకి ప్రవేశిం చాడు? రాజకీయాల్లోకి వచ్చాక వాటిని ఎలా ఉపయోగించుకున్నాడు? ఎలా దుర్వినియోగపర్చాడు? తర్వాత అతడు తప్పు తెలుసుకుని ఎలా బయటికొచ్చాడు అనేదే ఈ సినిమా కథ. ఒక మంచి ఫ్యామిలీ అంటే భార్యా భర్త ద్వారా చెప్పిన కథ ఇది. ఈ పాత్రలు చాలా నిజాలను ఓపెన్‌గా మాట్లాడేస్తాయి. ఆ పాత్రల ద్వారా ఇవ్వాళ్టి రాజకీయనేతలందరినీ చూస్తాం. అలా అని ఎవరినీ ఏకలేదు. నేతలందరినీ చూస్తాం. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారా? ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కాదుగానీ, రాజకీయ వ్యవస్థకు వ్యతిరేకంగా ఉంటుందీ సినిమా. చాలామందికి చాలా కోపాలున్నాయి. ఒక పార్టీ తరఫున పోటీ చేసి గెలుస్తున్నారు. అక్కడేదో ఆశ చూపిస్తే ఈ కండువా వదిలేసి ఆ పార్టీలోకి వెళుతున్నారు. ఇది సరైందా కాదా? జనం నీకు ఓటేసి గెలిపిస్తే ఆ పార్టీకే పనిచేయాలి. కానీ నువ్వేమో వేరేవాళ్లు అధికారంలోకి వచ్చారు అని చెప్పి అటు వెళ్లిపోతావు. అంటే ఎన్నికల ద్వారా వచ్చిన అధికారాన్ని నువ్వు దుర్వినియోగపరుస్తున్నావు. ఓటేసిన ఓటరును అగౌరవపర్చడం అలవాటు చేసుకున్నావు. బాబుతో మీకు మంచి పరిచయం ఉంది కదా, తనతోనే నేరుగా చెప్పవచ్చు కదా? చాలాసార్లు చెప్పానండి. మా నాన్న రాజకీయాల్లో చేరినప్పుడుగానీ రాజకీయ వ్యవస్థ ఇలా ఉంటుందని నాకు అసలు తెలీదు. డబ్బులిచ్చి ఓట్లు కొనుక్కుంటారనే విషయాలు నాకు షాక్ కలిగించేవి. అందుకే మా నాన్న ఎంపీ అయ్యాక ఒక్కరోజు కూడా నేను ఢిల్లీ వెళ్లలేదు. వెళ్లానంటే అధికారాన్ని నేను దుర్వినియోగం చేస్తానేమో అని ఆలోచించాను. బాపట్ల నియోజకవర్గ ప్రజ లకు నాన్న సహాయం చేయాలి అంతే కాని ఇంజనీరింగ్ కాలేజీలు వస్తున్నాయి. మనం ఒకటి తీసుకుందాం అనే ఆలోచనలను కూడా నేను మనసులోకి రానివ్వలేదు. ప్రస్తుత రాజకీయాలను చూస్తే ఏమనిపిస్తుంది? ఏమంత సంతృప్తిగా లేను. ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో పోటీ చేసి అధికారం కావాలనుకుంటున్నారు. గెలిచి అధికారంలోకి వచ్చాక కొంతమేరకు పాలన చేస్తున్నారు కాని అది ఏమాత్రం సరిపోదు. ఆ మాత్రం సేవతోటే సంతోషపడే మనుషుల నుంచి ఓట్లు మళ్లీ పొందగలుగుతున్నారు. అందుకే రాజకీయనేతలు చేయాల్సింది చాలా ఉంది. నాన్న పోటీ చేసినప్పుడు ప్రచారంలో మీకు ఏమనిపించింది? బాగా తిరిగాను. చాలా వాస్తవాలను తెలుసుకున్నాను. నగరాల్లో మనం సుఖంగా ఉంటున్నాం. కానీ గ్రామాల్లో అన్ని సమస్యల మధ్య కొనసాగుతూ కూడా ప్రజలు చాలా పాజిటివ్‌గా బతుకుతున్నారు. కొన్ని ఊళ్లకు మేం వెళితే ఎన్టీరామారావుగారికి మేం ఓటేసినాం ఆయన్ను చూసే మీకు ఓటేస్తాం అనేవారు తగిలారు. ఆయనతో చాలా పాత జ్ఞాపకాలను వారు గుర్తు పెట్టుకున్నారు. వాళ్లకు కనీసంగా రోడ్లు లేవు. టాయిలెట్లు లేవు. కాని ఎప్పుడో ఒక చిన్న పని, సహాయం చేశారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకుని వారు ఓట్లు వేసేస్తున్నారు. మనకు ఎంత రెస్పాన్సిబిలిటీ ఉండాలండీ.. అలాంటి ప్రజలను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి అనిపిస్తుంది. ఏ ముఖ్యమంత్రి అంటే మీకు బాగా ఇష్టం? ఎన్టీరామారావు, రాజశేఖరరెడ్డి ఇద్దరూ నిజమైన నాయకులు. నిర్ణయాలను వేగంగా తీసుకోవడంలో వీరిని మించిన వారు లేరు. అందుకే వారిలో నాయకత్వ లక్షణాలు ఉండేవి. ఆ నిర్ణయాలు మంచివా, చెడువా అనేది ముఖ్యం కాదు. వారిలో లీడర్షిప్ గుణం ఉండేది. సినిమావల్ల సమాజానికి మేలు జరుగుతోందా.. కీడు జరుగుతోందా? సమాజానికి చాలా కోణాలనుంచి చెడు జరుగుతోంది. ఒక్కసినిమా వల్లే మార్పు జరగదు. ఆడమ్ ఈవ్ వచ్చిన రోజునుంచి వద్దన్న దాని జోలికి వెళ్లడం మనిషికి అలవాటు అయిపోయింది. ప్రకృతి సహజంగానే మనిషికి అది అలవాటయిపోయింది. దొంగతనం, రేప్ వంటివి తప్పు అయితే అవి సినిమాలు రాకముందు నుంచే సమాజంలో ఉన్నాయి కదా. ధూమపానం హాని కరం అని ప్రచారం చేస్తున్నాం. ఎంతమంది సిగరెట్లు తాగటం మానేశారు? తాగడం అనారోగ్యకరం అనే ఎరుక వచ్చింది కాని తాగడం మానలేకపోతున్నారు. ధూమపానం తప్పు అని ప్రభుత్వం నిజంగా గుర్తిస్తుంటే దాన్ని పూర్తిగా ఎందుకు బ్యాన్ చేయదు? మద్యం సరఫరా ఎందుకు ఆపేయదు? అందుకే మనం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాం. అభివృద్ధి అనే పేరుతోటి ఏది తప్పో దాన్ని మనం సమర్ధిస్తూ వస్తున్నాం. డ్రగ్స్ కేసులో చిత్ర పరిశ్రమ పాత్ర గురించి? డ్రగ్స్ భూతాన్ని ఆపగలిగిన శక్తి ప్రభుత్వానికే ఉంది. దేశ సరిహద్దులు, కస్టమ్స్ శాఖను దాటి డ్రగ్స్ వస్తున్నాయి. దాన్ని ఆపలేకపోతున్నారు. కానీ అలా వచ్చిన డ్రగ్స్ చిన్న పిల్లల వద్దకు చేరుకోవడం చాలా బాధాకరమైన విషయం. చిన్నపిల్లలను డ్రగ్స్‌కు బానిసలుగా చేస్తూ.. వారిని జీవిత కాల కస్టమర్లుగా మార్చేస్తున్నారు. మరి డ్రగ్స్ తీసుకున్నారంటున్నవారిపై మీ అభిప్రాయం? వారు బాధితులే కానీ నేరస్తులు కాదండి. సినీ పరిశ్రమలో చిన్న ఘటన జరిగినా చాలా పెద్దగా ప్రచారం చేస్తారు. అది భరించాల్సిందే. క్రమశిక్షణా రాహిత్యాన్ని చిత్రపరిశ్రమ ఎన్నడూ సహించదు. ఎవరైనా తాగి సెట్లోకి వస్తేనే వారికి పని దొరకదు. ఇలాంటి వారిని తట్టుకోలేమని పంపించేస్తుంటాం. ఏ రంగంలో అయినా క్రమశిక్షణకే కెరీర్ ఉంటుంది, క్రమశిక్షణా రాహిత్యానికి ఎక్కడా కెరీర్ ఉండదు. డ్రగ్స్ తీసుకున్న వారి వల్ల షూటింగులో ఎవరికీ ఇబ్బంది కలిగి ఉండదు కాబట్టి వారి అలవాటువల్ల చిత్ర పరిశ్రమ ప్రభావితం కాలేదు. (సురేశ్ బాబుతో ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి) https://goo.gl/smJCxE https://goo.gl/eoUu9E -
డ్రగ్ కలకలం.. మీడియా హంగామా మాత్రమే : సురేష్ బాబు
ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తొలిసారిగా తన తనయుడు రానా హీరోగా సినిమాను నిర్మించిన సురేష్, సినిమా రిలీజ్ కు ముందు వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ శుక్రవారం (11-08-2017) రానా హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన నేనే రాజు నేనే మంత్రి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తిరుమలలో మీడియాతో మాట్లాడిన సురేష్ డ్రగ్స్ కేసుపై స్పందించారు. సినీ రంగంలో డ్రగ్ కలకలం కేవలం మీడియా హంగామా మాత్రమే అన్న సురేష్, ఇండస్ట్రీలో ఉన్న డ్రగ్స్ ప్రభావాన్ని తామే సరిదిద్దుకుంటామన్నారు. స్కూల్ పిల్లలపై డ్రగ్స్ ప్రభావం పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రతీ పౌరుడిదన్నారు. రాష్ట్రంలోకి డ్రగ్స్ రాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. భవిష్యత్తులో స్కూల్ పిల్లల్లో డ్రగ్స్ పై అవగాహన కల్పించే కార్యక్రమాలకు సినీ ఇండస్ట్రీ పూర్తి సహకారాన్ని అందిస్తుందని తెలిపారు. -
రానా ఆ అవకాశం ఇస్తాడో... లేదో?!
‘‘నాకు సిగ్గు ఎక్కువ. ‘పెళ్లి చూపులు’ అంటే మా స్నేహితుడి ఇంటికి అమ్మాయిని రమ్మని చెప్పాను. రమ్మన్నానే కానీ మాట్లాడాలంటే మొహమాటం. తను రావడం.. నేను మాట్లాడకపోవడం.. మూడు రోజులూ ఇదే తంతు. కనీసం హలో.. కూడా చెప్పలేదు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పేశాను. ఇప్పుడలా కాదు, పరిస్థితులు చాలా మారాయ్’’ అన్నారు నిర్మాత డి.సురేశ్ బాబు. ఆయన సమర్పణలో విజయ్ దేవరకొండ, రితూ వర్మ జంటగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రాజ్ కందుకూరి, యష్ రంగినేని నిర్మించిన సినిమా ‘పెళ్లి చూపులు’ ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా సురేశ్ బాబు చెప్పిన సంగతులు... ♦ విద్యావంతులు ఎక్కువ కావడం, ఎకనమిక్ ఇండిపెండెన్స్ పెరగడంతో ఈరోజుల్లో ‘పెళ్లి చూపులు’ చూసేవారి సంఖ్య తగ్గుతోంది. ‘కులం, ఆర్థిక స్థితి’ చూసి చాలా ప్లాన్డ్గా లవ్ చేసే యువత కొందరయితే.. మరికొందరు సహజంగా ప్రేమలో పడుతున్నారు. ♦ దర్శకుడు తరుణ్‌భాస్కర్ ఈ కథను ముందు నాకే చెప్పాడు. క్రమశిక్షణ గల ఓ అమ్మాయి, బద్ధకస్తుడైన అబ్బాయికి ‘పెళ్లి చూపులు’. ఒకే గదిలో ఉండాల్సి వస్తుంది. ఇద్దరూ తమ గతం గురించి చెప్పుకోవడం మొదలుపెడతారు. అదీ సినిమా. రాజ్ కందుకూరి ఈ కథ గురించి చెప్పగానే.. మంచిదని సలహా ఇచ్చాను. ♦ ఫస్ట్ కాపీ చూసిన తర్వాత హ్యాపీ ఫీలయ్యా. దర్శకుడు ప్రతి సన్నివేశాన్ని విభిన్నంగా తీర్చిదిద్దాడు. నాకు ఏ కథనైతే చెప్పాడో.. దాన్నే తెరపై చూపించాడు. బౌండ్ స్క్రిప్ట్, స్టోరీ బోర్డ్, సింక్ సౌండ్.. అన్నిటికీ మించి అనుకున్న బడ్జెట్లో ఫర్ఫెక్ట్గా తీశాడు. సినిమా తీసిన విధానం నాకు నచ్చడంతో భాగస్వామినయ్యా. తరుణ్ భాస్కర్‌తో మా సంస్థలో ఓ సినిమా నిర్మించడానికి రెడీ అయ్యాను. రెండు మూడు ఐడియాలు చెప్పాడు. ♦ మా సంస్థలో సినిమా నిర్మించి ఏడాదిన్నర కావొస్తోంది. కథ విషయంలో నేను చాలా పర్టిక్యులర్‌గా ఉంటాను. ఏ సినిమా పడితే అది తీస్తే.. డబ్బులు పోతాయేమో? పరువు పోతుందేమోనని నాకు భయం ఎక్కువ. వెంకటేశ్, రానా, నాగ చైతన్యలతో ఒక్కో సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నాను. వెంకీ, రానాలతో మల్టీస్టారర్ కూడా ప్లానింగ్‌లో ఉంది. అన్నీ కథాచర్చల్లో ఉన్నాయి. ♦ రెండేళ్లలో రానా పెళ్లి చేయాలనుకుంటున్నాం. పెళ్లి చూపులు ఏర్పాటు చేసే అవకాశం ఇస్తాడో! ప్రేమించానంటూ తనే ఓ అమ్మాయిని తీసుకొచ్చి మాకు పరిచయం చేస్తాడో (నవ్వుతూ). -
తలసానితో టాలీవుడ్ పెద్దలు భేటీ
హైదరాబాద్ : తెలంగాణ వాణిజ్య పన్నులు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో తెలుగు చిత్రపరిశ్రమ పెద్దలు సోమవారం భేటీ అయ్యారు. వారు ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు. త్వరలో సినీ ప్రముఖలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి తలసానిని కలిసిన వారిలో కేఎస్ రామారావు, దగ్గుబాటి సురేష్ బాబు తదితరులు ఉన్నారు.