
సాక్షి, హైదరాబాద్(యాకుత్‌పురా): సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్ తనకు అమ్మిన భూమిని ఆయన కొడుకు రానా పేరున రిజిస్ట్రేషన్ చేశారంటూ సదరన్ స్పైసిస్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ నందకుమార్ ఆరోపించారు. ఆయన మంగళవారం పురానీ హవేలీలోని సిటీసివిల్ కోర్టు ఎదుట మీడియాతో మాట్లాడారు. ఫిలింనగర్‌లో తనకు అగ్రిమెంట్ చేసిన భూమిని తనతో పాటు మరొకరికి కూడా అగ్రిమెంట్ చేసి మోసం చేశారని ఆరోపించారు.
(చదవండి: ఓటీటీలో వచ్చేస్తున్న ‘రాకెట్రీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..)
కోర్టు ఆదేశాలను సైతం లెక్కచేయకుండా రానా పేరున రిజిస్ట్రేషన్ చేశారనన్నారు. సినీ నటుడు వెంకటేశ్ సైతం 1200 గజాల భూమిని తనకు లీజ్ అగ్రిమెంట్ చేశారని నందకుమార్ తెలిపారు. సదరు స్థలం నుంచి బలవంతంగా తనను ఖాళీ చేయించేందుకు దగ్గుపాటి కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాగా.. రానా హాజరు కాకపోవడంతో విచారణను ఆగస్టు 2కు కోర్టు వాయిదా వేసింది.