ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు కారు బీభత్సం సృష్టించింది. రాంగ్‌రూట్‌లో దూసుకెళ్లిన కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంపీరియల్ గార్డెన్ వద్ద రాంగ్ రూట్‌లో దూసుకెళ్లిన సురేష్‌బాబుకు చెందిన టీఎస్09ఈఎక్స్2668 నెంబరు గల కారు అటుగా వెళుతున్న ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది.