బన్నీ నటనకు కళ్లు తిప్పుకోలేకపోయా: విక్టరీ వెంకటేశ్ | Tollywood Hero Venkatesh Review On Allu Arjun Pushpa 2 Movie | Sakshi
Sakshi News home page

Venkatesh Review: 'అల్లు అర్జున్‌ మరిచిపోలేని ప్రదర్శన'.. పుష్ప-2పై వెంకటేశ్ రివ్యూ

Published Wed, Dec 11 2024 4:08 PM | Last Updated on Wed, Dec 11 2024 4:08 PM

Tollywood Hero Venkatesh Review On Allu Arjun Pushpa 2 Movie

అ‍ల్లు అర్జున్ పుష్ప-2 చిత్రంపై టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేశ్ ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ అధ్బుతమైన ప్రదర్శన చేశారని కొనయాడారు. అల్లు అర్జున్ నటన చూసి కళ్లు పక్కకు కూడా తిప్పలేకపోయానని అన్నారు. దేశవ్యాప్తంగా ఈ మూవీ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకోవడం ఆనందంగా ఉందంటూ ట్వీట్ చేశారు.

పుష్ప-2లో హీరోయిన్ రష్మిక అసాధారణ ప్రదర్శన చేసినందని వెంకటేశ్ ప్రశంసించారు. గొప్ప విజయం సాధించిన సుకుమార్, దేవీశ్రీ ప్రసాద్‌తో పాటు చిత్రబృందానికి అభినందనలు తెలుపుతూ పుష్ప-2 పోస్టర్‌ను పంచుకున్నారు. అస్సలు తగ్గేదేలే అంటూ ‍క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు.

(ఇది చదవండి: 'పుష్ప 2' ఐదు రోజుల కలెక్షన్స్.. రూ.1000 కోట్లకు చేరువ)

కాగా.. ఈనెల 5న థియేటర్లలోకి వచ్చిన పుష్ప-2 బాక్సాఫీస్‌ను రఫ్పాడిస్తోంది. విడుదలైన ఐదు రోజుల్లోనే రూ.922 కోట్ల వసూళ్లతో ఆల్‌టైమ్ రికార్డ్ నమోదు చేసింది. తొలి రోజు పుష్పరాజ్‌ హవా కొనసాగుతోంది. రూ.294 కోట్లతో మొదలైన వసూళ్ల పర్వం అదేస్థాయిలో కొనసాగుతోంది. ఇ‍ప్పటికే నార్త్‌లోనూ సరికొత్త చరిత్ర సృష్టించింది పుష్ప-2. తొలిరోజే అత్యధిక నెట్ కలెక్షన్స్‌ రాబట్టిన చిత్రంగా పుష్ప-2 నిలిచింది. అత్యధిక వసూళ్లు సాధించిన నాన్ హిందీ సినిమాగా పుష్ప-2 సరికొత్త రికార్డ్ నెలకొల్పింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement