గుర్తుందా.. సింగిల్ ‘హ్యాండ్’!
సేవాభావం కలిగిన రఘురాంరెడ్డిని గెలిపిస్తే మేలు
కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారంలో సినీ హీరో వెంకటేష్
ర్యాలీలో పాల్గొన్న మంత్రి పొంగులేటి, ఎంపీ రేణుకా చౌదరి
ఖమ్మం వన్‌టౌన్: ‘అందరికీ గుర్తుందా.. చేయి గుర్తు.. సేవాభావం కలిగిన కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డిని గెలిపించుకుంటే ప్రజ లకు ఉపయోగపడే పనులు చేయడమే కాక అభివృద్ధికి పాటుపడతారని ఆయన వియ్యంకుడు, సినీ హీరో దగ్గుబాటి వెంకటేష్ తెలిపారు. రఘురాంరెడ్డి తరఫున మంగళవారం ఖమ్మంలో నిర్వహించిన రోడ్డుషోలో ఆయన పాల్గొన్నారు.
సాయంత్రం 6గంటలకు మయూరిసెంటర్ వద్ద ప్రారంభమైన రోడ్డుషో పాత ఎల్‌ఐసీ ఆఫీస్, జెడ్పీ సెంటర్, ప్రభుత్వ ఆస్పత్రి, ఇల్లెందు క్రాస్‌రోడ్డు వరకు కొనసాగింది. మార్గమధ్యలో జెడ్పీ సెంటర్, ఇల్లెందు క్రాస్‌రోడ్డు వద్ద జరిగిన కార్నర్ మీటింగ్‌లో వెంకటేష్ మాట్లాడుతూ అందరూ ఓటు వేయడాన్ని బాధ్యతగా భావించాలని సూచించారు.
‘ఎనీటైం... ఎనీ సెంటర్.. సింగిల్ హ్యాండ్ రఘురాంరెడ్డి.. కమాన్ ఖమ్మం’ అంటూ తన సినిమాల్లోని డైలాగ్‌లతో వెంకటేష్ ఆకట్టుకోగా ఆయనను చూసేందుకు రహదారి పొడవునా జనం బారులు దీరారు. అలాగే, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ శ్రేణులు సైతం భారీగా తరలివచ్చాయి అనంతరం రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడగా ఎంపీ రేణుకాచౌదరి, అభ్యర్ధి రామసహాయం రఘురాంరెడ్డితో పాటు తుమ్మల యుగంధర్, బాలసాని లక్ష్మీనారాయణ, మహ్మద్ జావీద్, కమర్తపు మురళి, పాలెపు విజయలక్ష్మి, రాపర్తి శరత్, దొబ్బల సౌజన్య, విజయాబాయి, నాగండ్ల దీపక్‌చౌదరి, తుంబూరు దయాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment