Victory Venkatesh Launch Vijay Sethupathi Annabelle Sethupathi Trailer - Sakshi
Sakshi News home page

వెంకటేశ్‌ చేతుల మీదుగా ‘అనబెల్‌..సేతుపతి’ ట్రైలర్‌ విడుదల

Published Mon, Aug 30 2021 6:57 PM | Last Updated on Mon, Aug 30 2021 8:07 PM

Victory Venkatesh Launch Vijay Sethupathi Annabelle Sethupathi Trailer - Sakshi

విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, హీరోయిన్‌ తాప్సీ పన్ను కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం ‘అనబెల్ సేతుపతి’. హారర్, కామెడీ నేపథ్యంలో దీపక్ సుందర రాజన్ రూపొందించిన ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. సుధన్ - జయరామ్ సంయుక్తంగా నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ ప్రేక్షకుకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఒకేసారి మూడు భాషల్లో రిలీజ్‌ అయిన ఈ ట్రైలర్‌ను తెలుగులో విక్టరి వెంకటేశ్‌, తమిళంలో సూర్య, మలయాళంలో మోహన్ లాల్‌లు విడుదల చేశారు. ఈ మూవీ సెప్టెంబర్ 17 నేరుగా హాట్ స్టార్ డిస్నీలో విడుదల కానుంది.

చదవండి: ‘బాహుబలి’ మూవీతో రాని గుర్తింపు, సార్పట్టకు వచ్చింది: నటుడు

ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. వీరసేతుపతి అనే రాజు నిర్మించిన రాజ్‌మహాల్‌ చూట్టూ కథ తిరగనుందని తెలుస్తోంది. విజయ్‌ సేతుపతి కత్తి యుద్దం చేస్తున్న సన్నివేశంతో ఈ ట్రైలర్‌ ప్రారంభం కాగా... ఆ తర్వాత తాప్సీతో కలిసి ఆ మహాల్‌ ఉన్న పలు సీన్లను చూపించారు. ఇక ఈ మహాల్‌ సొంతం చేసుకోవడానికి కొందరూ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ప్రేతాత్మలు వారిని ఎలా భయపెట్టాయి, ఈ క్రమంలో జరిగే కొన్ని ఫన్నీ సన్నివేశాలు సాంతం ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీ హారర్‌తో పాటు ఫుల్‌ కామెడీతో  ప్రేక్షకులను అలరించనున్నట్లు ట్రైలర్‌ చూస్తుంటే తెలుస్తోంది. కాగా జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, రాధిక, వెన్నెల కిషోర్, యోగిబాబు, దేవదర్శిని ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఈ సినిమా సెప్టెంబర్‌ 17వ తేదీ నుంచి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో డిస్నీ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.

చదవండి: ఆయనో స్టార్‌ డైరెక్టర్‌.. ఇప్పటికీ రూ.ఐదు వేల అద్దె కడుతూ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement