Vijay Sethupathi And Taapsee Pannu Annabelle First Look Out - Sakshi
Sakshi News home page

OTT: విజయ్‌- తాప్సీల ‘అనబెల్‌ సేతుపతి’ ఫస్ట్‌లుక్‌ విడుదల

Published Thu, Aug 26 2021 8:01 PM | Last Updated on Thu, Aug 26 2021 8:39 PM

Vijay Sethupathi And Taapsee Pannu Annabelle Sethupathi First Look Out - Sakshi

విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి, హీరోయిన్‌ తాప్సీ పన్నూ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘అనబెల్‌ సేతుపతి’.  హార్రర్-కామెడీ నేపథ్యంలో తెరకెక్కుత్ను ఈ చిత్రానికి దీపక్‌ సుందర్‌ రాజన్‌ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఈ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో విజయ్‌ సేతుపతి రాయల్‌ లుక్‌లో కనిపించగా, తాప్సి గౌను ధరించి రాణిలా ఆకట్టుకుంది.

చదవండి: కమల్‌ హాసన్‌ పాటకు విజయ్‌ సేతుపతి, నయనతార, సమంత స్టెప్పులు!

అయితే ఈ సినిమాను థియేటర్‌లో కాకుండా ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నట్లు ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రకటించింది. డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా సెప్టెంబరు 17న ‘అనబెల్‌.. సేతుపతి’ స్ట్రీమింగ్‌ కానుందని స్పష్టం చేశారు. కాగా ప్రముఖ దర్శకుడు సుందరాజన్‌ తనయుడు దీపక్‌ సుందర్‌ రాజన్‌  ఈ  మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఎప్పడూ వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరించే విజయ్‌, తాప్సీలు తొలిసారిగా జతకట్టడంతో ఈ మూవీపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. 

చదవండి: 
ఫొటోషూట్‌కు వెళ్లిన మోడల్‌పై చిరుతల దాడి
స్వరా భాస్కర్‌ గృహ ప్రవేశం.. షాకైన నెటిజన్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement