ఓటీటీలో 'విడుదల 2'.. ఫ్యాన్స్‌ కోసం ఎక్స్‌టెండెడ్‌ వెర్షన్‌ : వెట్రిమారన్‌ | Viduthalai part 2 Extension Version OTT Streaming | Sakshi
Sakshi News home page

ఓటీటీలో 'విడుదల 2'.. ఫ్యాన్స్‌ కోసం ఎక్స్‌టెండెడ్‌ వెర్షన్‌ : వెట్రిమారన్‌

Published Sat, Dec 21 2024 4:23 PM | Last Updated on Sat, Dec 21 2024 4:40 PM

Viduthalai part 2 Extension Version OTT Streaming

విజయ్‌ సేతుపతి, సూరి లీడ్‌ రోల్స్‌లో నటించిన ‘విడుదల 2’ సినిమా డిసెంబరు 20న విడుదలైంది.  వెట్రిమారన్‌ దర్శకత్వం వహించిన ‘విడుదల పార్ట్‌ 1’ చిత్రం 2023లో రిలీజ్‌ కాగా తమిళ్, తెలుగులో సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా వెట్రిమారన్‌ ‘విడుదల 2’ తెరకెక్కించారు. విజయ్‌ సేతుపతి, సూరి, మంజు వారియర్, గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్, భవానీ శ్రీ ముఖ్య తారలుగా నటించారు. అయితే, ఈ రెండు చిత్రాల పూర్తి రన్‌ టైమ్‌ రివీల్‌ చేసి దర్శకుడు షాక్‌ ఇచ్చారు.

విడుదల-1 పూర్తి రన్‌టైమ్‌ 2గంటల 40 నిమిషాలు ఉంటే.. విడుదల -2 మాత్రం 2గంటల 50 నిమిషాలు ఉంది. అయితే, ఈ రెండు చిత్రాల పూర్తి రన్‌టైమ్‌ సుమారు ఎనిమిది గంటలు ఉందని తాజాగా దర్శకుడు వెట్రిమారన్‌ రివీల్‌ చేశారు. కానీ తాను ప్రేక్షకులు చూపింది కేవలం 5:30 గంటలేనని ఆయన పేర్కొన్నారు. 'విడుదల 2' ఎక్స్‌టెండెడ్‌ వెర్షన్‌ను ఓటీటీలో విడుదల చేస్తామని ఆయన ప్రకటించారు. మరో గంట నిడివి గల ఫుటేజ్‌ను యాడ్‌ చేస్తామని  వెట్రిమారన్‌ పేర్కొన్నారు.

'విడుదల 1'లో సూరి మెప్పించాడు. దీంతో కథంతా కానిస్టేబుల్‌ ఆయన కోణంలోనే సాగితే. అయితే, రెండో పార్ట్‌లో ఎక్కువగా ఉద్యమ ప్రయాణం నేపథ్యంలో సాగింది. పెరుమాళ్‌గా విజయ్‌ సేతుపతి సహజమైన నటనతో మెప్పిస్తారు. ముఖ్యంగా  ఇంటర్వెల్‌ ఎపిసోడ్‌లో ఆయన పాత్ర తీరుకు మంచి మార్కులే పడ్డాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement