సేవ్‌ ది డేట్‌.. 'విక్రమ్‌' ట్రైలర్‌ డేట్‌ ఫిక్స్‌ | Kamal Haasan Vikram Movie Audio And Trailer Launch Date Announced | Sakshi
Sakshi News home page

Vikram Movie : సేవ్‌ ది డేట్‌.. 'విక్రమ్‌' ట్రైలర్‌ డేట్‌ ఫిక్స్‌

Published Tue, May 10 2022 6:05 PM | Last Updated on Tue, May 10 2022 6:05 PM

Kamal Haasan Vikram Movie Audio And Trailer Launch Date Announced - Sakshi

లోక నాయకుడు కమల్‌ హాసన్‌ నటిస్తున్న తాజా చిత్రం విక్రమ్‌. లోకేష్‌ కనగరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కమల్‌ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్ పతాకంపై భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్‌డేట్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఈనెల 15న ఈ సినిమా ట్రైలర్‌తో పాటు అదే రోజు సాయంత్రం గ్రాండ్‌గా ఆడియో లాంచింగ్‌ కార్యక్రమం ఉంటుందని ప్రకటించారు.


ఈ విషయాన్ని ప్రకటిస్తూ సేవ్‌ ది డేట్‌ అంటూ పోస్ట్‌ను వదిలారు. పొలిటికల్‌ యాక్షన్‌ థ్లిల్లర్‌గా సాగే ఈ మూవీలో తమిళ స్టార్‌ హీరో విజయ్ సేతుపతి, మలయాళీ పాపులర్‌ యాక్టర్‌ ఫహద్‌ ఫాజిల్‌ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.  ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌కు కోలీవుడ్‌ మ్యూజిక్ సెన్సేషన్‌ అనిరుధ్‌ సంగీతం అందించారు. జూన్‌ 3న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement