సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ‘సైంధవ్’గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన నుంచి వస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా చిత్రం ఇదే కావడం విశేషం. శైలేష్ కొలను ఈ మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా.. నవాజుద్దీన్ సిద్ధిఖీ, రుహాని శర్మ, ఆండ్రియా, బేబీ సారా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వెంకట్ బోయనపల్లి ఈ భారీ బడ్జెట్ చిత్రానికి నిర్మాతగా ఉన్నారు.
తాజాగా సైంధవ్ చిత్రం టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. కంప్లీట్ భారీ యాక్షన్ మోడ్‌లో సీన్లు ఉన్నట్లు తెలుస్తోంది. టీజర్‌లో బాలీవుడ్ ప్రముఖ యాక్టర్ నవాజుద్ధీన్ సిద్ధిఖీకి అడ్డొచ్చిన వారందరిని దారుణంగా చంపేస్తూ కనిపించాడు. దీంతో సైకోగా మారిన వెంకటేష్ ఎంట్రీ టీజర్‌లో అదుర్స్ అనిపించేలా ఉంటుంది.
(ఇదీ చదవండి: శ్రీలీల ఎవరి అమ్మాయో తెలిస్తే అంటూ షాకిచ్చిన అనిల్ రావిపూడి)
టీజర్‌లో కొన్ని షాట్స్ గూస్‌బంప్స్‌ను తెప్పిస్తాయి. వెంకటేశ్ చేతికి కత్తి, గన్ ఏది దొరికితే అది అన్నట్లుగా శత్రు సంహారం చేశాడు వెంకీ. ఈ టీజర్‌లో చాలా పవర్‌ఫుల్‌గా వెంకటేశ్ కనిపించాడు. ఈ సినిమా 2024 జనవరి 13న సంక్రాంతికి కానుకగా రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment