విక్టరీ వెంకటేశ్‌ ఇంట పెళ్లి.. వేడుకల్లో నమ్రత, సితార | Namrata, Sitara Attends Venkatesh Daughter's Hayavahini Mehndi Celebrations | Sakshi
Sakshi News home page

వెంకీమామ ఇంట పెళ్లి వేడుకలు.. హాజరైన మహేశ్‌ ఫ్యామిలీ

Mar 15 2024 1:17 PM | Updated on Mar 15 2024 1:39 PM

Namrata, Sitara Attends Venkatesh Daughter's Hayavahini Mehndi Celebrations - Sakshi

నిశ్చితార్థపు వేడుకలాగే పెళ్లి కూడా సీక్రెట్‌గానే పెద్దగా హంగూ ఆర్భాటాలు లేకుండా సింపుల్‌గా జరిపించనున్నట్లు తెలుస్తోంది.

విక్టరీ వెంకటేశ్‌ ఇంట పెళ్లి వేడుకలు జోరందుకున్నాయి. వెంకీ చిన్న కూతురు హయవాహిని నేడు(మార్చి 15న) మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టనుంది. డాక్టర్‌ ఫ్యామిలీకి చెందిన అబ్బాయితో కూతురి పెళ్లి జరగనుంది. గతేడాది అక్టోబర్‌లో ఎంతో సింపుల్‌గా ఎంగేజ్‌మెంట్‌ కానిచ్చేశారు. నిశ్చితార్థపు వేడుకలాగే పెళ్లి కూడా సీక్రెట్‌గానే పెద్దగా హంగూ ఆర్భాటాలు లేకుండా సింపుల్‌గా జరిపించనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే హల్దీ, మెహందీ వేడుకలు జరిగాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఏవీ లీక్‌ కాకుండా జాగ్రత్తపడ్డారు. అయితే తాజాగా మహేశ్‌బాబు సతీమణి నమ్రత శిరోద్కర్‌ మెహందీ సెలబ్రేషన్స్‌ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో మంచి సమయం గడిపానంటూ పెళ్లికూతురు, పెళ్లికొడుకుతో ఫోటోలు దిగింది. ఈ వేడుకల్లో నమ్రత కూతురు సితార సైతం సందడి చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.

చదవండి: ఒక్క సినిమాతో టాలీవుడ్‌ను ఊపేసింది.. ఈ బ్యూటీ ఎక్కడుందో గుర్తుపట్టారా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement