
‘ఇంటి పనుల్లో సహాయం చేసి, నిజమైన మగాళ్లు అనిపించుకుందాం’ అని ‘బీ ది రియల్ మేన్ ఛాలెంజ్’ను స్టార్ట్ చేశారు దర్శకుడు సందీప్ వంగ. ఆ తర్వాత రాజమౌళి, సుకుమార్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, కొరటాల శివ, కీరవాణి ఈ చాలెంజ్‌ను స్వీకరించారు. ఎన్టీఆర్ విసిరిన చాలెంజ్‌ని అంగీకరించి తాజాగా చిరంజీవి, వెంకటేష్ కూడా ‘బీ ది రియల్ మేన్’ చాలెంజ్ వీడియోలు పోస్ట్ చేశారు.
‘ఫ్లోర్ క్లీన్ చేయడం, దోసె వేయడం, వండిన దోసెను వాళ్ల అమ్మగారికి వడ్డించడం’ వంటి పనులు చేస్తున్న వీడియోను షేర్ చేసి, ‘‘నేను రోజూ చేసే పనులే. ఇవాళ మీ కోసం ఈ వీడియో సాక్ష్యం’’ అని పేర్కొన్నారు చిరంజీవి. ఈ ఛాలెంజ్‌కి మంత్రి కేటీఆర్, రజనీకాంత్, దర్శకులు మణిరత్నంలను ఎంపిక చేశారు చిరు. దోసె వేస్తూ దాన్ని చిరంజీవి తిరగేయడం వీడియోలో ఒక హైలెట్.
‘మన కుటుంబానికి ఇంటి పనుల్లో సహాయం చేసి నిజమైన మగాళ్లుగా ఉందాం’ అన్నారు వెంకటేశ్. ఆయన పోస్ట్ చేసిన వీడియోలో ఇల్లు శుభ్రం చేస్తూ, వంట చేస్తూ, గార్డెనింగ్ చేసి, పని పూర్తయ్యాక పుస్తకం పట్టుకుని కనిపించారు వెంకటేశ్. ‘‘ఈ ఛాలెంజ్‌కు చిన్నోడు మహేష్‌బాబును, కో–బ్రదర్ వరుణ్ తేజ్‌ని, దర్శకుడు అనిల్ రావిపూడిని ఎంపిక చేస్తున్నా’’ అని పేర్కొన్నారు వెంకీ. దర్శకుడు క్రిష్ కూడా ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. మొక్కలకు నీళ్లు పోయడం, వంట చేయడం చేస్తున్న వీడియో పంచుకు న్నారు క్రిష్. నిర్మాత శోభు యార్లగడ్డ కూడా ఈ చాలెంజ్‌లో పాల్గొని అడవి శేష్, అల్లు అర్జున్, ప్రభాస్‌లను ఎంపిక చేశారాయన.
Comments
Please login to add a commentAdd a comment