పెద్ద కూతురు ఆశ్రిత ఎంగేజ్‌మెంట్‌లో వెంకటేశ్ ఫ్యామిలీ
దగ్గుబాటి ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. వెంకటేశ్-నీరజల రెండో కూతురు హయవాహిని పెళ్లి పీటలెక్కనుంది. వెంకటేశ్ పెద్దమ్మాయి ఆశ్రితకు కొన్నేళ్ల క్రితమే పెళ్లయింది. ఇప్పుడు రెండో అమ్మాయి హయవాహిని పెళ్లికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. విజయవాడకు చెందిన ఓ డాక్టర్ కుటుంబంతో వెంకీ మామ వియ్యమనేందుకు రెడీ అయ్యాడట.
రేపే నిశ్చితార్థం?
బుధవారం(అక్టోబర్ 25న) విజయవాడలో వీరి నిశ్చితార్థం జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుక కోసం దగ్గుబాటి కుటుంబం ఈపాటికే విజయవాడ బయల్దేరిందని సమాచారం. ఇకపోతే ఈ వేడుకకు ఇరు కుటుంబాలు సహా అత్యంత దగ్గరి బంధుమిత్రులే హాజరు కానున్నట్లు తెలుస్తోంది. కాగా వెంకీమామ సోషల్ మీడియాలో పెద్ద యాక్టివ్‌గా ఉండడు. అంతేకాదు, తన పిల్లల్ని కూడా సినిమా ఇండస్ట్రీలోకి తీసుకురావాలనుకోలేదు. వారికి నచ్చిన రంగాన్ని ఎంచుకోమని పిల్లలకు స్వేచ్ఛనిచ్చాడు.
సినిమాల సంగతేంటంటే?
ఇదిలా ఉంటే వెంకటేశ్ నుంచి సినిమా వచ్చి ఏడాది దాటిపోయింది. గతేడాది ఎఫ్ 3, ఓరి దేవుడా సినిమాలతో ప్రేక్షకులను పలకరరించాడు. ఈ ఏడాది రానా నాయుడు అనే వెబ్ సిరీస్‌తో ఓటీటీలోనూ ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవలే హిందీ చిత్రం కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమాలో ముఖ్య పాత్రలో నటించాడు. ప్రస్తుతం వెంకీ మామ హీరోగా సైంధవ్ సినిమా చేస్తున్నాడు.
చదవండి: ఓటీటీలో సైకో థ్రిల్లర్ మూవీ.. ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
Comments
Please login to add a commentAdd a comment