Sarkaru Vaari Paata First Day Collections In AP And Telangana - Sakshi
Sakshi News home page

SVP First Day Collection: బాక్సాఫీస్‌పై మహేశ్‌ వేట..రికార్డు కలెక్షన్స్‌

Published Fri, May 13 2022 11:09 AM | Last Updated on Fri, May 13 2022 3:30 PM

Sarkaru Vaari Paata First Day Collections In AP And Telangana - Sakshi

Sarkaru Vaari Paata First Day Collection: సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు మోస్ట్‌ అవెటెడ్‌ మూవీ సర్కారు వారి పాట గురువారం(మే 12) విడుదలై పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. మార్నింగ్‌ షో నుంచే పాజిటివ్‌ టాక్‌ రావడంతో ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. నిన్న దాదాపు అన్ని చోట్ల హౌస్‌ఫుల్‌ బోర్డులు దర్శనమిచ్చాయి. దాదాపు రెండేళ్ల గ్యాప్‌ తర్వాత మహేశ్‌ నుంచి వచ్చిన సినిమా ఇది.

(చదవండి: ‘సర్కారు వారి పాట’ రివ్యూ)

తెరపై సూపర్‌ స్టార్‌ చాలా స్టైలీష్‌గా కనిపించడం.. కామెడీ, యాక్షన్‌తో పాటు అదిరిపోయే స్టెప్పులేయడంతో ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు కూడా ‘సర్కారు వారి పాట’కి ఫిదా అయ్యారు. దీంతో తొలిరోజు బాక్సాఫీస్‌ వద్ద ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు దాదాపు రూ. 36.63 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టి.. మహేశ్‌ బాబు సత్తా ఏంటో మరోసారి గుర్తు చేసింది.  ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ.75 కోట్ల గ్రాస్‌ వసూళ్లను సాధించింది. 

సర్కారు వారి పాట ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ వివరాలు

► నైజాం - రూ. 12.24 కోట్లు

► సీడెడ్ - రూ. 4.7 కోట్లు

► ఈస్ట్ - రూ. 3.25 కోట్లు

► వెస్ట్ - రూ. 2.74 కోట్లు

► ఉత్త‌రాంధ్ర - రూ. 3.73 కోట్లు

► గుంటూరు- రూ. 5.83 కోట్లు

► కృష్ణా - రూ. 2.58 కోట్లు 

► నెల్లూరు - రూ. 1.56 కోట్లు

 మొత్తం రూ.36.69 కోట్లు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement