సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా, ‘గీత గోవిందం’ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం మే 12 ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం సాధించింది. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్న ఈ చిత్రం.. బాక్సాపీస్ వద్ద చరిత్ర సృష్టిస్తోంది.
(చదవండి: ‘సర్కారు వారి పాట’ చూసిన సితార పాప రియాక్షన్ ఏంటంటే..)
కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.160.2 కోట్ల గ్రాస్, రూ. 100.44 కోట్ల షేర్‌ని సాధించి, రికార్డు క్రియేట్ చేసింది. ఐదు రోజుల్లో రూ.100కోట్ల షేర్ సాధించిన తొలి ప్రాంతీయ చిత్రమిది. నైజాం ఏరియాల్లో ఈ చిత్రం 31.47 కోట్ల వసూళ్లను రాబట్టింది. నైజాంలో 30కోట్లకు పైగా వసూళ్ల సాధించిన మూడో చిత్రమిది. ఈ చిత్రానికి దాదాపు రూ.120 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. మరో 20 కోట్ల రూపాయలను వసూలు చేయాల్సి ఉంది. ఇదే స్పీడ్ కొనసాగితే మరో మూడు, నాలుగు రోజుల్లోనే ‘సర్కారు వారి పాట’ బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
సర్కారు వారి పాట ఐదు రోజులు కలెక్షన్స్ వివరాలు
► నైజాం - రూ.31.47 కోట్లు
► సీడెడ్ - రూ.10.44 కోట్లు
► ఈస్ట్ - రూ.7.05కోట్లు
► వెస్ట్ - రూ.4.65కోట్లు
► ఉత్తరాంధ్ర - రూ.10.25 కోట్లు
► గుంటూరు- రూ.7.85కోట్లు
► కృష్ణా - రూ.5.76కోట్లు
► నెల్లూరు - రూ.3.12 కోట్లు
► కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా- 7.75 కోట్లు
►ఓవర్సీస్-12.1 కోట్లు
►మొత్తం 100.44 కోట్లు(షేర్)
#BlockbusterSVP is setting new benchmarks in TFI 🔥#SVP #SVPMania #SarkaruVaariPaata
— Mythri Movie Makers (@MythriOfficial) May 17, 2022
Super🌟 @urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @GMBents @14ReelsPlus @saregamasouth pic.twitter.com/g4bAenYhDI
Comments
Please login to add a commentAdd a comment