
చాలా రోజుల తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఈ శుక్రవారం (ఆగస్ట్ 05) విడుదలైన బింబిసార, సీతారామం చిత్రాలు రెండూ హిట్ టాక్‌తో దూసుకెళ్తున్నాయి. వీటిలో కలెక్షన్స్ పరంగా బింబిసార ఒకడుగు ముందు ఉంది. కల్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ వశిష్ట్ దర్శకత్వం వహించాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ నిర్మించారు. కేథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు.
(చదవండి: హీరోగా, నిర్మాతగా అభినందనీయం.. కానీ ఆ ట్యాగ్?)
నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతూ రికార్డులు సృష్టిస్తోంది. తొలి రోజు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.7.27 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టగా.. రెండో రోజు కూడా అదే జోరును కొనసాగింది. రెండో రోజు ఈ చిత్రం రూ.4.52 కోట్లను రాబట్టింది.
ఈ చిత్రానికి రూ.15.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.16 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు ఈ చిత్రం రెండు రోజులకి రూ.12.37 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కు రూ.3.63 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఆదివారం కూడా ఇదే జోరు కొనసాగితే ఈజీగా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
బింబిసార’ రెండు రోజుల కలెక్షన్స్..
► నైజాం - రూ. 3.92 కోట్లు
► సీడెడ్ - రూ. 2.24 కోట్లు
► ఈస్ట్ - రూ. 70 లక్షలు
► వెస్ట్ - రూ.55 లక్షలు
► ఉత్తరాంధ్ర - రూ.1.55 కోట్లు
► గుంటూరు- రూ.89 లక్షలు
► కృష్ణా - రూ.59 లక్షలు
► నెల్లూరు - రూ.38 లక్షలు
► కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా- రూ. 0.50 లక్షలు
► ఓవర్సీస్ రూ.1.05 కోట్లు
► ప్రపంచ వ్యాప్తంగా మెత్తం రూ. 12.37 కోట్లు(రూ.20 కోట్ల గ్రాస్)
Comments
Please login to add a commentAdd a comment