మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘భోళా శంకర్’. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన వేదాళం చిత్రానికి తెలుగు రీమేక్ ఇది. మెహర్ రమేశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్‌గా నటించగా, కీర్తి సురేశ్, సుశాంత్ ఇతర కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(ఆగస్ట్ 11) విడుదలైన ఈ చిత్రానికి తొలిరోజే నెగెటివ్ టాక్ లభించింది. మెగాస్టార్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ చిత్రం పట్ల అసంతృప్తిగానే ఉన్నారు. ఫలితంగా తొలి రోజు ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు.
(చదవండి: భోళా శంకర్ మూవీ రివ్యూ)
‘భోళా శంకర్’ ఫస్ట్‌డే కలెక్షన్స్
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు ఈ చిత్రం రూ.28 కోట్ల గ్రాస్(రూ.18.61 కోట్ల షేర్) వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాలలో మొత్తంగా రూ. 15.51 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఏరియాల వారిగా చూస్తే.. నైజాంలో రూ.4.50 కోట్లు, సీడెడ్- రూ.2 కోట్లు, ఈస్ట్-1.50 కోట్లు, వెస్ట్- రూ.1.85 కోట్లు, గుంటూరు- రూ.2.07 కోట్లు, కృష్ణా- రూ.1.02 కోట్లు, నెల్లూరు-రూ.73లక్షలు, కర్ణాటక, ఓవర్సీస్‌లో మొత్తంగా రూ. 3.1 కోట్లు వసూలు చేసింది.
టార్గెట్ రూ.82 కోట్లు
భోళా శంకర్ చిత్రానికి దాదాపు రూ. 80 కోట్ల ప్రిరీలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. సినిమా హిట్ అవ్వాలంటే మినిమమ్ రూ.82 కోట్ల కలెక్షన్స్ రాబట్టాలి. తొలిరోజే నెగెటివ్ టాక్ రావడంతో అంత స్థాయిలో వసూళ్లను రాబట్టకపోవచ్చునని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు రజనీకాంత్ ‘జైలర్’సినిమాకు మంచి టాక్ రావడంతో ఆ ఎఫెక్ట్ కూడా ‘భోళా శంకర్’పై పడే అవకాశం ఉంది.
చిరు గత సినిమాల కలెక్షన్స్ ఎంత?
ఇక చిరంజీవి గత చిత్రాల వసూళ్లతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో ఇది కాస్త తక్కువనే చెప్పాలి. చిరంజీవి గత ఐదు సినిమాల ఫస్ట్‌డే వసూళ్లను పరిశీలిస్తే.. వాల్తేరు వీరయ్య-రూ.22.75 కోట్లు, గాడ్ ఫాదర్-రూ.12.83 కోట్లు, ఆచార్య- రూ.28.29 కోట్లు, సైరా- రూ. 36.37 కోట్లు, ఖైదీ నెం 150- రూ. 23.16 కోట్ల వసూళ్లను రాబట్టాయి. భోళా శంకర్‌కు తొలి రోజే నెగెటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ మరింత తగ్గే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment