బాక్సాఫీస్‌ వద్ద ‘ఖుషి’ జోరు.. ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ ఎంతంటే? | Kushi Movie Box Office Collection Day 1 Details | Sakshi
Sakshi News home page

Kushi Movie Box Office Collection: బాక్సాఫీస్‌ వద్ద ‘ఖుషి’ జోరు.. ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ ఎంతంటే?

Sep 2 2023 2:08 PM | Updated on Sep 2 2023 3:03 PM

Kushi Movie Box Office Collection Day 1 Details - Sakshi

ఎట్టకేలకు విజయ్‌ దేవరకొండ ఖాతాలో హిట్‌ పడింది. లైగర్‌ లాంటి భారీ డిజాస్టర్‌ తర్వాత విజయ్‌ దేవరకొండ నటించిన చిత్రం ‘ఖుషి’. సమంత హీరోయిన్‌. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం(సెప్టెంబర్‌ 1) విడుదలై.. తొలిరోజే పాజిటివ్‌ టాక్‌ సంపాదించుకుంది. విజయ్‌-సమంతల ఆన్‌స్క్రీన్‌ కెమిస్ట్రీకి సినీ ప్రియులు ఫిదా అయ్యారు. అద్భుతమైన పాటలు, బీజీఎం,  విజువల్స్‌తో ‘ఖుషి’ విజయంలో కీలక పాత్ర పోషించాయి.

(చదవండి:  ‘ఖుషి’మూవీ రివ్యూ)

ఫస్ట్‌ డేనే హిట్‌ టాక్‌ రావడంతో బాక్సాఫీస్‌ వద్ద ఈ చిత్రానికి మంచి కలెక్షన్స్‌ వచ్చాయి. తొలో రోజు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.30.1కోట్ల గ్రాస్‌ వసూళ్లను రాబట్టింది. ఏరియాల వారిగా చూస్తే.. ‘నైజాం రూ.5.15 కోట్లు, సీడెడ్‌ రూ.91 లక్షలు, ఉత్తరాంధ్ర రూ.1.13 కోట్లు, ఈస్ట్‌ రూ.66 లక్షలు, వెస్ట్‌ రూ.63 లక్షలు, గుంటూరు రూ. 66 లక్షలు, కృష్ణా రూ. 44లక్షలు, నెల్లూరు రూ.29 లక్షలు, కర్ణాటక-రెస్టాఫ్‌ ఇండయాలో రూ.85 లక్షలు, ఇతర భాషల్లో రూ.45 లక్షల వసూళ్లను రాబట్టింది. 

యూస్‌లో ఖుషి జోరు
ఇక యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఖుషి జోరు కనిపిస్తోంది. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ వద్ద 8 లక్షల డాలర్స్ కలెక్షన్స్ అందుకుంది. వన్ మిలియన్ మార్క్ వైపు వేగంగా పరుగులు పెడుతోంది. ఖుషికి ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణ చూస్తుంటే...మరిన్ని సర్ ప్రైజింగ్ బాక్సాఫీస్ నెంబర్స్ సాధిస్తుందని అనుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement