'ఖుషి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా? | Kushi Movie OTT Release Date And Streaming Details | Sakshi
Sakshi News home page

Kushi Movie OTT: విజయ్-సామ్ 'ఖుషి' ఓటీటీలోకి వచ్చేది ఆరోజేనా?

Published Sun, Sep 17 2023 6:39 PM | Last Updated on Mon, Sep 18 2023 11:09 AM

Kushi Movie OTT Release Date And Streaming Details - Sakshi

ఎన్ని రకాల సినిమాలొచ్చినా సరే ఓ మంచి ప్రేమ కథ చూస్తున్నప్పుడే ఆ ఫీలింగే వేరు. అలా ఈ మధ్య కాలంలో లవ్‌స్టోరీతో వచ్చి ఆకట్టుకున్న చిత్రం 'ఖుషి'. విజయ్ దేవరకొండ, సమంత కలిసి అద్భుతమైన కెమిస్ట్రీ పండించిన ఈ చిత్రం.. థియేటర్ల నుంచి దాదాపు సైడ్ అయిపోయింది. ఈ క్రమంలోనే ఓటీటీ డేట్ బయటకొచ్చింది.

(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి' లుక్ లీక్.. కోట్ల నష్టపరిహారం డిమాండ్!)

కథేంటి?
విప్లవ్(విజయ్ దేవరకొండ).. నాస్తికుల ఫ్యామిలీకి చెందిన కుర్రాడు. బీఎస్ఎన్ఎల్‌లో ఉద్యోగం రావడంతో అడిగి మరీ కశ‍్మీర్‌లో పోస్టింగ్ వేయించుకుంటాడు. అక్కడ ఆరా బేగం (సమంత)ని లవ్‌లో పడతాడు. కొన్నాళ్లకు ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. అయితే తాను ముస్లిం కాదు హిందు అని, తన పేరు ఆరాధ్య అని ఫ్యామిలీ డీటైల్స్ చెబుతుంది. మరి చివరకు విప్లవ్-ఆరాధ్య ఒక్కటయ్యారా? అసలేం ఏం జరిగింది? అనేదే 'ఖుషి' స్టోరీ.

ఓటీటీ డేట్ అదేనా?
విడుదలకు ముందే ఓటీటీ డీల్ సెట్ చేసుకున్న 'ఖుషి' సినిమాను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సాధారణంగా ఒప్పందం ప్రకారం తను దక్కించుకున్న సినిమాల్ని నెలలోపే స్ట్రీమింగ్ చేసేస్తూ ఉంటుంది. అయితే 'ఖుషి'ని మాత్రం నెల దాటిన తర్వాత అందుబాటులోకి తీసుకొస్తున్నారట. అంటే అక్టోబరు 6న ఓటటీలో 'ఖుషి' రిలీజ్ కానుందని సమాచారం. మరోవైపు తొలి వీకెండ్‌లో అద్భుతమైన వసూళ్లు రాబట్టిన ఖుషి.. లాంగ్ రన్‌లో మాత్రం రూ.10 కోట్ల మేర నష్టపోయినట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: 'చంద్రముఖి 2' దర్శకుడి బర్త్ డే.. గిఫ్ట్‌గా ల్యాప్‌ట్యాప్స్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement