నా మీద, నా సినిమాపైన దాడులు: విజయ్‌ దేవరకొండ | Vijay Deverakonda Sensational Comments On Trolls At Kushi Success Meet - Sakshi
Sakshi News home page

Vijay Deverakonda: నా మీద, నా సినిమాపైన దాడులు జరుగుతున్నాయి: విజయ్‌ దేవరకొండ

Sep 5 2023 10:32 AM | Updated on Sep 5 2023 4:10 PM

Vijay Deverakonda Sensational Comments On Trolls - Sakshi

విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖుషీ. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది.  లైగర్ లాంటి డిజాస్టర్ తర్వాత విజయ్‌ అందుకున్న హిట్ ఖుషి...  ఈ సినిమా మూడు రోజుల్లో రూ. 70 కోట్లు రాబట్టి ఇండస్ట్రీని షేక్ చేసింది. దీంతో ఖుషి టీమ్ ఫుల్‌ జోష్‌లో ఉంది. ఈ నేపథ్యంలోనే ఖుషి సక్సెస్ మీట్‌ను వైజాగ్ లో నిర్వహించారు. అక్కడ విజయ్‌ పలు ఆసక్తకరమైన విషయాలను షేర్‌ చేశాడు.

(ఇదీ చదవండి: ప్రియురాలితో బిగ్‌ బాస్‌ ఫేమ్‌ మహేశ్ విట్టా పెళ్లి.. ఫోటోలు వైరల్‌)

తన మీద, ఖుషి సినిమాపైన సోషల్‌ మీడియాలో దాడులు జరుగుతున్నాయని ఆయన సెన్సేషనల్‌ కామెంట్లు చేశారు. ' కొందరు డబ్బులిచ్చి మరీ మా సినిమాపై నెగెటివిటీ తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్నో ఫేక్‌ రేటింగ్స్‌ వచ్చాయి.. ముఖ్యంగా యూట్యూబ్‌ ఫేక్‌ రివ్యూలనూ దాటుకుని ఖుషి సినిమా విజయవంతంగా రన్‌ అవుతుంది. అందుకు కారణం నా అభిమానులుగా ఉన్న మీ  ప్రేమే... మీరిచ్చే ఈ ఎనర్జీ చూస్తుంటే ఇప్పుడు వాటి గురించి చర్చించి నిరుత్సాహపరచడం ఇష్టం లేదు. వాటి సంగతి మరో రోజు చూసుకుందాం. ఈ సినిమాతో మీ ముఖాల్లో నవ్వులు చూడాలనుకునే నా కోరిక తీరింది.

(ఇదీ చదవండి: ఫ్యాన్స్‌కు కోటి విరాళం.. ఇలా దరఖాస్తు చేసుకోండి: విజయ్‌)

ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నా. డబ్బు సంపాదించాలి, అమ్మ, నాన్నలను హ్యాపీగా ఉంచాలి. సమాజంలో గౌరవం కావాలి. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకునే నేను ఎప్పుడూ పనిచేస్తుంటా. కానీ, ఇప్పుటి నుంచి కొన్ని నిర్ణయాలు మార్చుకుంటున్నా... మీ మీకోసం పనిచేయాలని అనుకుంటున్నా. నాతో పాటుగా మీరూ ఆనందంగా ఉండాలి. అందుకే వంద కుటుంబాలను ఎంపిక చేసి నా సంపాదన నుంచి రూ.కోటిని (ఒక్కో ఫ్యామిలీకి రూ.లక్ష) పది రోజుల్లో అందిస్తా. ఇక నుంచి మనమంతా దేవర ఫ్యామిలీ.

నా ఆనందంలో మీరు ఉన్నారు. అలాంటప్పుడు నా సంపాదనలో కొంత భాగాన్ని మీతో పంచుకోకపోతే వేస్ట్‌.' అని విజయ్‌ పేర్కొన్నారు.  త్వరలో తన అభిమానుల కోసం మరిన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు విజయ్‌ దేవరకొండ తెలిపాడు.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement