సమంత తెలివైన అమ్మాయి.. ఆమె సలహాతో నాలో మార్పు: విజయ్‌ దేవరకొండ | Kushi Movie: Vijay Deverakonda's National Q&A With Fans, Sharing Interesting Facts - Sakshi
Sakshi News home page

Vijay Deverakonda Q&A With Fans: సామ్‌ సలహాతో నాలో మార్పు.. ఆ విషయంలో మా ఇద్దరి ఆలోచనలు ఒక్కటే..

Published Thu, Aug 31 2023 12:26 PM | Last Updated on Thu, Aug 31 2023 1:01 PM

Vijay Devarakonda Conduct Q and A With Fans, Sharing Interesting Facts - Sakshi

‘ఏదైన నాకు నచ్చకుంటే ఓపెన్‌గా చెప్పేస్తాను. డైరెక్టర్‌ శివ విషయంలోను అదే చేశాను. ఖుషి సినిమా షూటింగ్‌ మొదలైన నెల రోజుల తర్వాత అతనితో కనెక్ట్‌ అయ్యాను. ఫస్ట్‌ ఏం నచ్చకున్నా బాగాలేదని ఫేస్‌ మీదనే చెప్పేవాడిని. అది చూసిన సమంత.. ‘విజయ్‌..ఏం చెప్పాలన్నా ఓ పద్దతి ఉంటుంది. అలా డైరెక్ట్‌గా ఫేస్‌ మీద చెప్పకూడదు’అని సలహా ఇచ్చింది. సామ్‌ సలహా నాలో మార్పును తీసుకొచ్చింది’అని స్టార్‌ హీరో విజయ్‌ దేవరకొండ అన్నాడు. విజయ్‌, సమంత జంటగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఖుషి’. సెప్టెంబర్‌ 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా విజయ్‌ అభిమానులతో  క్యూ అండ్ ఏ నిర్వహించాడు. యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లో ఈ క్యూ అండ్ ఏ లైవ్ స్ట్రీమ్ అయ్యింది. ఫ్యాన్స్ తో జరిపిన ఈ ఇంటరాక్షన్ లో ఖుషి హైలైట్స్ తో పాటు పర్సనల్ లైఫ్ లో తన అభిప్రాయాలు, జీవితాన్ని తాను చూసే పర్సెప్షన్ గురించి చెప్పుకొచ్చాడు. అవేంటో విజయ్‌ మాటల్లోనే.. 

శివకు సినిమా పిచ్చి
డైరెక్టర్‌ శివ నిర్వాణతో కనెక్ట్‌ అయ్యేందుకు నాకు నెల రోజుల టైమ్‌ పట్టింది. ఆ తర్వాత ఆయన మీద నాకు నమ్మకం ఏర్పడింది.  పాటల దగ్గర నుంచి ప్రతీది ఆయన డెసిషన్ కే వదిలేశా. ఎందుకంటే శివకు సినిమా పిచ్చి. తన సినిమా ఎలా ఉండాలో ఖచ్చితంగా ఆయనకు తెలుసు. ఆ ఫ్రేమ్ నుంచి బయటకు రాడు. మనం ఏదైనా బాగుంటుందని చెబితే నచ్చితే తీసుకుంటాడు. అది కథకు అవసరం ఉండదు అనుకుంటే ఎందుకు ఉండదో చెబుతాడు.

అందుకే మ్యూజిక్‌ కన్సర్ట్‌
ఖుషి సినిమాలో ఎమోషన్, రొమాన్స్, యాక్షన్ కంటే ఫన్ ను ఎక్కువగా ఎంజాయ్ చేశాను. ఫస్టాఫ్ లో వెన్నెల కిషోర్ తో మంచి కామెడీ వర్కవుట్ అయ్యింది. అలాగే సెకండాఫ్ లో రాహుల్ రామకృష్ణతో కలిసి నవ్విస్తాను. ఈ సినిమాలోని ఖుషి టైటిల్ సాంగ్ వినగానే బాగా నచ్చింది. ఆ పాట ముందు మోషన్ పోస్టర్ కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అనుకున్నాం. ఇంప్రెసివ్ గా ఉండటంతో సామ్, శివ, నేను కలిసి హేషమ్ తో మాట్లాడి దాన్ని ఫుల్ సాంగ్ చేశాం. ఖుషి పాటలను విన్నప్పుడు ఈ మ్యూజిక్ ను సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్నాం. అలా మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించాం. ఆ మ్యూజిక్ కన్సర్ట్ టైమ్ లో ఆరోగ్యం బాగా లేకున్నా సమంత పార్టిసిపేట్ చేసింది. ఆ స్టేజీ మీద సమంతతో లైవ్ పర్ ఫార్మ్ చేశాను. 

సమంత తెలివేన అమ్మాయి
సమంత తెలివైన అమ్మాయి. శివ, నేను మూవీ గురించి డిస్కస్ చేసేప్పుడు ఆమె మంచి ఐడియాస్ చెప్పేది. మా ఇద్దరిలో చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. మేమిద్దరం మిడిల్ క్లాస్ నుంచి వచ్చాం కాబట్టి డబ్బు,లైఫ్ గురించి ఒకేలా ఆలోచనలు ఉంటాయి. అలాగే మా ఇద్దరికీ హిస్టరీ అంటే ఇష్టం. సమంత దేవుడిని ఆరాధిస్తుంది. నేను మతపరమైనవి, దేవుడి గురించి డౌట్స్ అడుగుతుంటా. సమంతతో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా ఉంటుంది.

డైరెక్షన్‌ వైపు వెళ్తా..
డైరెక్షన్ చేయడం అనేది ఎగ్జైట్ చేస్తూ ఉంటుంది. లైఫ్ లో కొద్ది కాలం తర్వాత యాక్టింగ్ నుంచి బ్రేక్ తీసుకుని డైరెక్షన్ చేయాలని అనుకుంటున్నా. కానీ నా దగ్గరకు వచ్చే స్క్రిప్ట్స్ చదువుతుంటే నటించడం ఆపలేను అనిపిస్తుంటుంది. వయసు ఉంది కాబట్టి ఇప్పుడు ఎంతైనా కష్టపడగలను. ఫ్యూచర్ లో ఏదో ఒక పాయింట్ లో డైరెక్షన్ వైపు వెళ్తా.

ఫెయిల్యూర్, సక్సెస్ ఒకేలా చూడాలి
లైఫ్ లో ఫెయిల్యూర్ చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరికి ఫెయిల్యూర్ అనేది ఏదో ఒక టైమ్ లో తప్పకుండా ఎదురవుతుంది. నేనూ లైఫ్ లో బిగ్ సక్సెస్ అండ్  ఫెయిల్యూర్స్ చూశాను. వాటి గురించి బయట చాలా మంది మాట్లాడారు. నా దృష్టిలో  ఫెయిల్యూర్, సక్సెస్ ఒకేలా చూడాలి. చేసిన తప్పులు చేయకుండా అపజయాల నుంచి నేర్చుకోవాలి. ఫెయిల్యూర్ మనకు చాలా విషయాలు నేర్పిస్తుంది. జీవితం అంటే ఓడటం, గెలవడం కాదు జీవించడం. లైఫ్ లో మిమ్మల్ని మీరు ఏ పొజిషన్ లో చూడాలని అనుకుంటున్నారో ఆ గమ్యం వైపు ఒక్కో అడుగు వేస్తూ వెళ్లండి.

హైదరాబాద్ బిర్యానీ అంటే ఇష్టం
నా ఫేవరేట్ ఫుడ్స్ చాలా ఉన్నాయి. హైదరాబాద్ బిర్యానీ, దోశ, బర్గర్, ఛీజ్ కేక్ ఇష్టంగా తింటాను. ఇవన్నీ తిన్నా వర్కవుట్ బాగా చేస్తా. అలా బరువు పెరగకుండా చూసుకుంటా.నాకు ఆర్కిటెక్చర్ ఇష్టం. మా ఇంట్లో డెకరేషన్ ఎలా ఉండాలో నేనే సెలెక్ట్ చేశా. ఫ్యూచర్ లో ఒక ఫామ్ కొని దాన్ని నాకు నచ్చినట్లు డిజైన్ చేయించుకోవాలని అనుకుంటున్నా. 

బిజినెస్ ఆలోచనలూ ఉన్నాయి
నాకు ట్రావెలింగ్, స్పోర్ట్స్ ఇష్టం. ఆ మధ్య మాల్దీవ్స్ వెళ్లాను. హెవెన్ లా అనిపించింది. ఖుషి షూటింగ్ టైమ్ లో కాశ్మీర్ వెళ్లాను. అది నా ఫేవరేట్ ప్లేస్ అయింది. మా  ఫ్రెండ్స్ తో కలిసి బాస్కెట్ బాల్ ఆడుతుంటాం. కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం ఇష్టం. అలాగే బిజినెస్ ఆలోచనలూ ఉన్నాయి. ఈ విషయంపై మా ఫ్యామిలీ, నా టీమ్ తో ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాను. ఎంటర్ ప్రెన్యూర్ లో కొద్ది రోజుల్లోనే నా నుంచి ఒక ప్రకటన వస్తుంది.

 డ్రీమ్‌ క్యారెక్టర్స్‌ లేవు
సోషియో ఫాంటసీ మూవీ జానర్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అయితే ఆ స్క్రిప్ట్స్ ఆకట్టుకునేలా రాయడం కష్టం. అలాంటి స్క్రిప్ట్స్ వస్తే తప్పకుండా నటిస్తా. నాకు డ్రీమ్ క్యారెక్టర్స్ అంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు. ఇప్పుడు చేసిన ఖుషి, తర్వాత చేస్తున్న వీడీ 12, వీడీ 13 సినిమాలకు సూపర్బ్ స్క్రిప్ట్స్ ఉన్నాయి. అలాంటి స్క్రిప్ట్స్ లో నటిస్తానని ఊహించలేదు. తమిళ్ డైరెక్టర్స్ అరుణ్ మాతేశ్వరన్, అరుణ్ ప్రభు ఇద్దరూ టాలెంటెడ్. వారితో స్క్రిప్ట్స్ వర్క్స్ జరుగుతున్నాయి. స్క్రిప్ట్స్ లాక్ అయితే వెంటనే మూవీస్ ప్రారంభిస్తా.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement