నిఖిల్ సిద్దార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన రెండో చిత్రం ‘18 పేజెస్’. ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథను అందించారు. ఆయన శిష్యుడు సూర్యప్రతాప్ పల్నాటి దర్శకత్వం వహించాడు. వరుస హిట్ సినిమాలను నిర్మిస్తున్న ‘జీఏ 2’ పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
తొలిరోజే ఈ మూవీ పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం..ఈ చిత్రం తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.3.45 కోట్ల(రూ.1.75 షేర్) కలెక్షన్స్ రాబట్టింది. అత్యధికంగా నిజాంలో రూ.1.05 కోట్లు, సీడెడ్‌లో రూ.0.25 కోట్లు, ఆంధ్రాలో రూ.1.05 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఈ చిత్రానికి రూ.12 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.12.50 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. తొలిరోజు రూ.1.75 కోట్లు మాత్రమే సాధించింది. ఇంకో రూ.10.75 కోట్ల కలెక్షన్స్ రాబడితే ఈ చిత్రం సేఫ్ జోన్‌లోకి వెళ్తుంది. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో వీకెండ్ డేస్‌లో కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉందని, బ్రేక్ ఈవెన్ ఈజీగా సాధిస్తుందని సీనీ వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment