జనవరి 15న సంక్రాంతి పండగ అయిపోయింది. కాని మెగాస్టార్ చిరంజీవి కారణంగా తెలుగు రాష్ట్రాల్లో పండగ సంబరాలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. పూనకాలు కూడా కొనసాగుతున్నాయి. జనవరి 13న సంక్రాంతి కానుకగా థియేటర్స్ లోకి వచ్చాడు వాల్తేరు వీరయ్య. చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి, రవితేజ కలిసి నటించిన చిత్రం కావడంతో వాల్తేరు వీరయ్యపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టే కలెక్షన్స్‌ని రాబడుతూ రికార్డులు సృష్టిస్తోంది. సంక్రాంతి పండక్కి బాస్ వస్తే బాక్సాఫీస్ పీస్ పీస్ అవుతుందని ఈ చిత్రం ద్వారా మరో సారి ప్రూవ్ అయింది.
తొలి మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన వీరయ్య... తొమ్మిది రోజుల్లో రూ.182 కోట్ల గ్రాస్(106 కోట్ల షేర్) వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లో ఏరియా వారిగా పరిశీలిస్తే.. నైజాంలో రూ.28.87కోట్లు, సీడెడ్‌లో రూ.15.30 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.13.24 కోట్లు, గుంటూరు రూ.6.72 కోట్లు, కృష్ణ రూ.6.47 కోట్లు, నెల్లూరులో రూ.3.38 కోట్లతో షేర్ వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది.
ఒక్క తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు ఓవర్సీస్ లో సైతం వాల్తేరు వీరయ్య మేనియా కనిపిస్తోంది. ముఖ్యంగా యూఎస్ఏలో చిరు జోరు కొనసాగుతోంది. అక్కడ కూడా వాల్తేరు వీరయ్య 2 మిలియన్ క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మెగాస్టార్ కు బ్లాక్ బస్టర్ పడితే అనకాపల్లి టు అమెరికా పూనకాలు కామన్ అనే విషయాన్ని మరోసారి నిజం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment