4 రోజుల్లో 50 కోట్లు రాబట్టిన ‘గల్లీ బాయ్‌’ | Gully Boy box office collection | Sakshi
Sakshi News home page

మంచి వసూళ్లు రాబడుతున్న రణవీర్‌ ‘గల్లీబాయ్‌’

Published Sun, Feb 17 2019 7:49 PM | Last Updated on Sun, Feb 17 2019 8:11 PM

Gully Boy box office collection - Sakshi

ముంబై: రణ్‌వీర్‌ సింగ్‌, ఆలియా భట్‌ జంటగా నటించిన తాజా సినిమా ‘గల్లీ బాయ్‌’.. దేశీ ర్యాప్‌ కల్చర్‌ సంగీత నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ప్రేమికుల రోజు సందర్భంగా గత గురువారం విడుదలైన ఈ సినిమా నాలుగురోజుల్లో 51.15 కోట్లు రాబట్టింది. వీకెండ్‌లో చివరిరోజైన ఆదివారం కూడా ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టి మొదటి ఐదు రోజుల్లో రూ. 70 కోట్లు దాటే అవకాశముందని బాలీవుడ్‌ ట్రేడ్‌ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ ట్విటర్‌లో తెలిపారు. మొదటి నాలుగు రోజుల్లో ఈ సినిమా వరుసగా గురువారం రూ. 19.40 కోట్లు, శుక్రవారం రూ. 13.10 కోట్లు, శనివారం రూ. 18.65 కోట్లు వసూలు చేసిందని ఆయన తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement