నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కార్తికేయ 2’. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్ పై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మించారు.ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో కీలక పాత్ర పోషించాడు. భారీ అంచనాల మధ్య ఆగస్ట్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి రోజే హిట్‌టాక్ సంపాదించుకుంది.
(చదవండి: ‘ కార్తికేయ2 ’ మూవీ రివ్యూ)
దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం దూసుకెళ్తోంది. ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో థియేటర్స్ లభించనప్పటికీ.. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.8.50 కోట్ల గ్రాస్, రూ.5.05 కోట్ల షేర్ వసూళ్లని రాబట్టింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు రూ.5.30 కోట్ల గ్రాస్, రూ.3.50 కోట్ల షేర్ కలెక్షన్స్‌ని రాబట్టి.. నిఖిల్ కెరీర్‌లోనే ఫస్ట్‌డే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా ‘కార్తికేయ2’ నిలిచింది. నిఖిల్ గత ఐదు సినిమాల తొలిరోజు వసూళ్లని పరిశీలిస్తే.. అర్జున్ సురవరం రూ.1.38 కోట్లు, కిర్రాక్ పార్టీ రూ.1.65 కోట్లు, కేశవా రూ.1.58 కోట్లు, ఎక్కడికి పోతావు చిన్నవాడా రూ.1.25 కోట్ల షేర్స్ అందుకున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో కార్తికేయ2 తొలిరోజు కలెక్షన్స్(ఏరియాల వారిగా)
► నైజాం - రూ.1.24 కోట్లు
► సీడెడ్ -రూ.40 లక్షలు
► ఈస్ట్ - రూ.33 లక్షలు
► వెస్ట్ - రూ.20 లక్షలు
► ఉత్తరాంధ్ర - రూ.45లక్షలు
► గుంటూరు- రూ.44 లక్షలు
► కృష్ణా - రూ.27 లక్షలు
► నెల్లూరు - రూ.17 లక్షలు
► మెత్తం రూ. రూ.3.50 కోట్లు(షేర్)
సిని విశ్లేషకుల సమాచారం ప్రకారం... కార్తికేయ 2 చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.17.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే రూ.18 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాసం ఉండాలి. తొలిరోజే హిట్ టాక్ రావడంతో బ్రేక్ ఈవెన్ ఈజీగా దాటుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment