నేనురల్ స్టార్ నాని హీరోగా నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన చిత్రం ‘దసరా’. శ్రీరామనవమి సంద్భంగా మార్చి 30న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. రా అండ్ రస్టిక్ స్టోరీతో తెరకెక్కించన ఈ చిత్రంలో నాని ఊరమాస్ లుక్‌లో అదరగొట్టేశాడు. ఫలితంగా తొలి రోజే రూ.38 కోట్ల గ్రాస్ వసూలు చేసి నాని కెరీర్‌లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిసింది. రెండు రోజుల్లోన్లే రూ. 50 కోట్లు కొల్లగొట్టిన ఈ చిత్రం.. ఈజీగా వంద కోట్ల క్లబ్‌లోకి చేరుతుందని అంతా భావించారు. అనుకున్నట్లే దసరా సినిమా కేవలం వారం రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి అదరగొట్టింది.
మార్చి 30న ఈ సినిమా రిలీజ్ అవ్వగా ఏప్రిల్ 5 నాటికి దసరా సినిమా రూ. 100 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. నాని కెరీర్‌లో రూ. 100 కోట్ల వసూళ్లను సాధించిన చిత్రంగా ‘దసరా’ నిలిచింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నానికి జోడిగా కీర్తి సురేశ్ నటించింది. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.
శ్రీకాంత్‌కు కి బీఎండబ్ల్యూ కారు
ఇక దసరా విజయం చూసి నిర్మాత చెరుకూరి సుధాకర్ మురిసిపోతున్నాడు. వారం రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్బులోకి చేరడంతో.. తెగ ఆనందపడిపోతున్న నిర్మాత.. దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకు బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్‌గా ఇచ్చాడు.అలాగే ఈ మూవీ కోసం పనిచేసిన కీ మెంబర్స్ అందరికీ తలో 10 గ్రాముల గోల్డ్ కాయిన్స్ కూడా బహుమతిగా అందజేశారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Our effort. Your gift 🙏🏼
— Nani (@NameisNani) April 5, 2023
Cinema wins ♥️#Dasara pic.twitter.com/Rn0VR6nFkL
Comments
Please login to add a commentAdd a comment