నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం ‘దసరా’ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సునామీని సృష్టిస్తోంది. మార్చి 30న విడుదలైన ఈ చిత్రం..తొలి రోజే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. తెలంగాణ నేపథ్యంలో రా అండ్ రస్టిక్ స్టోరీతో తెరకెక్కిన ఈ చిత్రంలో నాని ఊరమాస్ నటనతో అదరగొట్టేశాడు. సినిమా చూసిన ప్రతి ఒక్కరు నాని, కీర్తి సురేశ్ నటనతో పాటు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పనితనంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
(చదవండి: ‘దసరా’మూవీ రివ్యూ)
ఫలితంగా కలెక్షన్స్ పరంగా ‘దసరా’ దూసుకెళ్తోంది. తొలి రోజే రూ.38 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం.. రెండో రోజు రూ.15 కోట్ల కలెక్షన్స్‌ని రాబట్టి సత్తా చాటింది. మొత్తం రెండు రోజుల్లో దాదాపు రూ.53 కోట్లు గ్రాస్ వసూళ్లను సాధించింది. నైజాం ఏరియాలో ఈ సినిమా రూ. 10.25 కోట్లకు పైగా వసూలు చేసి బ్రేక్ ఈవెన్ సాధించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక ఓవర్సీస్‌లోనూ ‘దసరా’దూసుకెళ్తోంది. రెండు రోజుల్లో అక్కడ 1.2 మిలియన్ డాలర్లను వసూలు చేసి నాని ఖతాలో నయా రికార్డును చేర్చింది. విడుదలైన అన్ని భాషల్లోనూ ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. కాబట్టి ఈ వీకెండ్‌లో కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నానికి జోడిగా కీర్తి సురేశ్ నటించింది. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.
#Dasara's MASS RAMPAGE at the Box Office ❤️🔥
— SLV Cinemas (@SLVCinemasOffl) April 1, 2023
53+ CRORES Gross Worldwide in 2 days 💥🔥
- https://t.co/9H7Xp8jaoG#DhoomDhaamBlockbuster
Natural Star @NameisNani @KeerthyOfficial @Dheekshiths @odela_srikanth @Music_Santhosh @NavinNooli @sathyaDP @saregamasouth pic.twitter.com/xPi31ks9Ir
Comments
Please login to add a commentAdd a comment