ప్రస్తుతం స్టార్ హీరోలంతా పాన్ ఇండియా సినిమాలపై ఫోకస్ పెట్టారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ అనే తేడా లేకుండా అంతటా పాన్ ఇండియా సినిమాల జోరు కొనసాగుతుంది. ఇక మన టాలీవుడ్ నుంచి అయితే చాలా సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో రాణిస్తున్నాయి. స్టార్ హీరోలు అందరూ కూడా పాన్ ఇండియా బ్రాండ్ తోనే తమ సినిమాలని రిలీజ్ చేస్తున్నారు.
పక్కనే ఉన్న కోలీవుడ్ హీరోలు కూడా ఇప్పుడు మనవాళ్లనే ఫాలో అవుతున్నారు. తమ సినిమాలను కూడా అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. అంతేకాదు ఎలాగైనా పాన్ ఇండియా పోటీలో తాము కూడా పై చేయి సాధించాలని కసిగా ఉన్నారు. ఇప్పటి వరకు పాన్ ఇండియా స్థాయిలో రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన సినిమాల్లో టాలీవుడ్ పాటు కన్నడ సినిమాలు కూడా ఉన్నాయి.
కానీ కోలీవుడ్ నుంచి ఒక్క సినిమా కూడా లేదు. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలు రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరాయి. ఇక కన్నడ నుంచి కేజీయఫ్, కేజీయఫ్ 2 చిత్రాలు కూడా రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. కోలీవుడ్ నుంచి జైలర్ కచ్చితంగా రూ. 1000 కోట్లు సాధిస్తుందని అంతా భావించారు. కానీ అది రూ. 600 కోట్ల దగ్గరకు వచ్చి ఆగిపోయింది.
ఇక ఇప్పుడు కోలీవుడ్ ఆశలన్నీ సూర్యపైనే ఉన్నాయి. ఆయన నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం కంగువా రూ. 1000 కోట్లు సాధించి, అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుందని ధీమాగా ఉన్నారు. ఈ మధ్య విడుదలైన ప్రచార చిత్రాలు, గ్లింప్స్ చూస్తుంటే కచ్చితంగా 1000 కోట్లు కలెక్ట్ చేసే మొట్టమొదటి చిత్రం అవుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. చిత్ర నిర్మాతలు కూడా రూ. 1000 కోట్లే టార్గెట్‌గా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
డైరెక్టర్ శివ రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. కంగువా పార్ట్ 1 ఈ ఏడాదిలో విడుదల కానుంది. ఇందులో సూర్య ద్విపాత్రాభినయం చేయడం విశేషం. ఇప్పటికే ఇందులోని పిరియడ్ కాల పాత్రకు సంబంధించిన ఆయన గెటప్, టీజర్ విడుదల చేయగా విశేష ఆదరణ పొందాయి. కాగా బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, యోగిబాబు, రెడిన్ కింగ్‌స్లీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం, వెట్రి పళనిసామి ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 38 భాషలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment