చిన్న చిత్రంగా వచ్చి భారీ విజయం సాధించిన చిత్రం ‘కాంతార’. సెప్టెంబర్ 30న కేవలం కన్నడలో విడుదలైన ఈ చిత్రం ఆక్కడ ప్రభంజనం సృష్టించింది. కేవలం 15 రోజుల్లోనే ఒక్క కన్నడలోనే రూ.92 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి కేజీయఫ్ రికార్డులను బద్దలు కొట్టింది. శాండిల్ వుడ్‌లో కేజీయఫ్2 తర్వాత ఈ స్థాయి వసూళ్లను రాబట్టిన చిత్రం ‘కాంతారా’నే. ఓవర్సీస్‌లోనూ మంచి వసూళ్లను రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 15 రోజుల్లో రూ.150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది.
(చదవండి: కాంతార మూవీ రివ్యూ)
అంతటి సంచలన విజయం సాధించిన ఈ చిత్రాన్ని తాజాగా తెలుగులో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ‘గీతాఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్’ ద్వారావిడుదల చేశారు. శనివారం(అక్టోబర్ 15)టాలీవుడ్‌లో రిలీజైన ఈ చిత్రం.. మంచి ఓపెనింగ్స్‌ని సాధించింది. ఈ సినిమా తెలుగు హక్కులు కేవలం రూ.2 కోట్లకు అమ్ముడు పోయాయి. అయితే తొలిరోజే హిట్ టాక్ రావడంతో రూ. కోటీ వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమా హీరో,హీరోయిన్లు ఎవరో కూడా తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియదు. కానీ కేవలం కథ మాత్రమే ఆడియన్స్‌ని థియేటర్స్‌కి రప్పిస్తుంది.
అయితే ఈ సినిమాను థియేటర్స్‌లో చూస్తే భారీ బడ్జెట్‌తో నిర్మించినట్లు కనిపిస్తుంది. కానీ ఈ సినిమా మేకింగ్‌కి అయిన ఖర్చు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. వందల కోట్లు కొల్లగొడుతున్న ఈ చిత్రాన్ని రిషబ్ శెట్టి కేవలం రూ.16 కోట్ల బడ్జెట్‌తోనే తెరకెక్కించారట. ఈ లెక్కన ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రానికి వచ్చిన హిట్ టాక్ చూస్తే.. కేవలం తెలుగులోనే బడ్జెట్‌కి పెట్టిన రూ.16 కోట్లు ఈజీగా వసూళ్లు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరాంగదుర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
Comments
Please login to add a commentAdd a comment