మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ‘భోళా శంకర్’. భారీ అంచనాల మధ్య ఆగస్ట్11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. తొలి రోజు నుంచే నెగెటివ్ టాక్ రావడంతో చిరు కెరీర్‌లోనే భారీ డిజాస్టర్ చిత్రంగా నిలిచింది. దాదాపు రూ.110 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ కనీసం అందులో పావు వంతు కూడా కలెక్షన్స్ రాబట్టలేకపోయిందనే వార్తలు వినిపిస్తునాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం ఇప్పటివరకు కేవలం రూ. 30 కోట్లను మాత్రమే వసూలు చేసింది.
రూ.50 కోట్ల నష్టం!
మెగాస్టార్ చిరంజీవి సినిమా కావడంతో భోళా శంకర్‌కి భారీగా ప్రిరిలీజ్ బిజినెస్ జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 80 కోట్ల బిజినెస్ జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఈ సినిమా హిట్ అవ్వాలంటే మినిమమ్ రూ.82 కోట్ల కలెక్షన్స్ రాబట్టాలి. ఇప్పటి వరకు కేలవం రూ.30 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అంటే ఇంకా 50 కోట్లు కలెక్ట్ చేస్తేగానీ ఈ చిత్రం సేఫ్‌జోన్‌లోకి వెల్లదు. ఈ చిత్రం విడుదలే ఇప్పటికే పది రోజులు దాటింటి. పైగా తొలి రోజు నుంచే నెగెటివ్ టాక్. కాబట్టి ఇక ఈ సినిమా థియేటర్లలోనుంచి తీసేసే చాన్స్ ఎక్కువగా ఉంది. ఓవరాల్‌గా చూస్తే ఈ చిత్రానికి రూ.50 కోట్ల నష్టం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
భారీ ధరకు ఓటీటీ రైట్స్
ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర్ నిర్మించిన ఈ చిత్రం కోసం పలు ఓటీటీ సంస్థలు పోటీ పడ్డాయట. కానీ చివరకు నెట్‌ఫిక్స్ ఓటీటీ రైట్స్‌ని దక్కించుకుంది. అది కూడా రూ. 30 కోట్లకు. అయితే ఇదంతా సినిమా రిలీజ్‌కు ముందు జరిగింది. మెగాస్టార్ గత చిత్రం వాల్తేరు వీరయ్య ఓటీటీ రైట్స్ కూడా ఈ సంస్థే దక్కించుకుంది. దానికి మంచి రిజల్ట్ రావడంతో.. భోళా శంకర్‌కి భారీ ధర చెల్లించి, ఓటీటీ హక్కులను కొనుగోలు చేసింది. అయితే సినిమా విడుదల తర్వాత ఫలితంగా దారుణంగా రావడంతో ఆ ఎఫెక్ట్ ఓటీటీపై కూడా ఉంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఓటీటీ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఏమేరకు ఆదరిస్తారో చూడాలి.
ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడు?
సాధారణంగా ఏ చిత్రమైనా భారీ విజయం సాధిస్తే.. ఓటీటీలో కాస్త లేట్‌గా స్ట్రీమింగ్ అవుతాయి. మొదట ఫలానా డేట్‌కి స్ట్రీమింగ్ చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నా.. సినిమా ఫలితాన్ని బట్టి వాయిదా వేస్తారు. అదే డిజాస్టర్ టాక్ వస్తే మాత్రం అనుకున్నదానికంటే ముందే ఓటీటీలోకి వచ్చేస్తుంది. భోళా శంకర్ విషయంలోనూ అదే జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం విడుదలైన 8 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని తొలుత భావించారట. కానీ టాక్ దారుణంగా రావడంతో అనుకున్నదాని కంటే ముందే ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తున్నారట. సెప్టెంబర్ 18న నుంచి నెప్ట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం స్క్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సింది.
Comments
Please login to add a commentAdd a comment