మాస్ మహారాజా ‘ధమాకా’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. శ్రీలీల హీరోయిన్‌గా నటించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ డిసెంబర్ 23ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తొలి రోజే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. రవితేజ ఎనర్జీ, యాక్షన్ ఎలిమెంట్స్.. శ్రీలీల గ్లామర్, డ్యాన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. దీంతో ఈ సినిమా కలెక్షన్స్ రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.
తొలి రోజే రూ.10 కోట్ల గ్రాస్ వసూలు సాధించిన ఈ చిత్రం.. ఐదు రోజుల్లో మొత్తం రూ.49 కోట్ల కలెక్షన్స్ రాబట్టి క్రాక్ తర్వా త మళ్లీ ఆ రేంజ్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఇదే ఊపు కొనసాగితే ఈ వారాంతలో వంద కోట్ల గ్రాస్ మార్కును కూడా టచ్ అయ్య చాన్స్ ఉందని ట్రేడ్ వర్గాల చెబుతున్నాయి. ఈ సినిమాకు మాస్‌తో పాటు క్లాస్ సెంటర్స్‌లోనూ మంచి స్పందన రావడం విశేషం.
మాస్ మహారాజా రవి తేజ డబల్ రోల్ పోషించిన ఈ చిత్రానికి నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రసన్న కుమార్ బెజవాడ కథ-స్క్రీన్‌ప్లే-మాటలు అందించారు.
MassMaharaja @RaviTeja_offl 's
— People Media Factory (@peoplemediafcy) December 28, 2022
MASSive 5️⃣ Days
BoxOffice Rampage 💥#DhamakaBlockBuster in Cinemas Now 🥳🤩#Dhamaka
Book your tickets nowhttps://t.co/iZ40p9utmY@sreeleela14 @TrinadharaoNak1 @vishwaprasadtg @vivekkuchibotla @KumarBezwada pic.twitter.com/7xAKb4X78o
Comments
Please login to add a commentAdd a comment