దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘సీతారామం’. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(ఆగస్ట్ 05) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి తొలి రోజే పాజిటివ్ టాక్ వచ్చింది. సీత, రామ్‌ల లవ్‌స్టోరీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
(చదవండి: ‘సీతారామం’ మూవీ రివ్యూ)
అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ చిత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్స్‌ని రాబట్టలేకపోయింది. ట్రేడ్ వర్గాల సమాచారం తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో సీతారామం సినిమాకు రూ. 2.25 కోట్లు గ్రాస్(రూ.1.50 కోట్ల షేర్) కలెక్షన్స్ వచ్చాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ. 5.60 కోట్ల గ్రాస్, రూ. రూ.3.05 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. ‘సీతారామం’ క్లాసిక్ లవ్ స్టోరీ అవ్వడంతో ఏ సెంటర్ ఆడియన్స్ బాకా కనెక్ట్ అయినప్పటికీ.. బీ, సీ సెంటర్ ‘బింబిసార’ జోరు వలన ఈ చిత్రం భారీ కలెక్షన్స్‌ని రాబట్టలేకపోయింది. అయితే ఇలాంటి చిత్రాలకు కలెక్షన్స్ మెల్లి మెల్లిగా పెరిగే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
‘సీతారామం’ చిత్రానికి మొత్తంగా రూ.16.20 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగిందంట. చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.17 కోట్ల వరకు సాధించాల్సి ఉంటుంది. తొలి రోజు రూ.3.05 కోట్లు వసూలు చేసింది. ఇంకా రూ.13.95 కోట్ల కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. ఈ చిత్రానికి వచ్చిన టాక్‌ని బట్టి చూస్తే.. బ్రేక్ ఈవెన్ ఈజీగా సాధిస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
‘సీతారామం’ తొలి రోజు కలెక్షన్స్..
► నైజాం - రూ.54 లక్షలు
► సీడెడ్ - రూ.16 లక్షలు
► ఈస్ట్ - రూ.15 లక్షలు
► వెస్ట్ - రూ.8లక్షలు
► ఉత్తరాంధ్ర - రూ.23 లక్షలు
► గుంటూరు- రూ.16లక్షలు
► కృష్ణా - రూ.13 లక్షలు
► నెల్లూరు - రూ. 5లక్షలు
► కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా- రూ.15 లక్షలు
► ఓవర్సీస్ రూ.1.05 కోట్లు
► ఇతర భాషలు రూ.35 లక్షలు
► ప్రపంచ వ్యాప్తంగా మెత్తం రూ. రూ.3.05 కోట్లు(రూ.5.60 గ్రాస్ వసూలు)
Comments
Please login to add a commentAdd a comment