
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా 'సీతారామం'. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అందమైన ప్రేమ కావ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మిక, సుమంత్ కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. తాజాగా ఈ చిత్రం హిందీ వర్షన్ ఓటీటీకి సంబంధించి బిగ్ అప్‌డేట్ వచ్చింది.
(చదవండి: న్యూజెర్సీలో సీతారామం టీమ్ సందడి, దుల్కర్, మృణాల్‌కు లవ్ లెటర్స్)
సీతారామం హిందీ వర్షన్ ఓటీటీ అఫీషియల్ డేట్ వచ్చేసింది. ఈనెల 18 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. రిలీజ్ రోజు నుంచే హిట్ టాక్ రావడంతో హిందీలోనూ ఈ చిత్రాన్ని విడుదల చేశారు. అక్కడ కూడా బాలీవుడ్ అభిమానుల నుంచి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. టాలీవుడ్ వర్షన్ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం హిందీ వర్షన్ కూడా ఓటీటీలోకి రానుండడంతో థియేటర్లలో చూడలేని వారికి ఎంచక్కా ఓటీటీలో చూసేయండి.
#Sitaramam (Hindi) Premieres on Disney+ Hotstar - November 18th. 🤩😍#SitaRamamHindi @dulQuer @mrunal0801 @iamRashmika https://t.co/uqC5GgRHtS
— South Hindi Dubbed Movies (@SHDMOVIES) November 9, 2022
Comments
Please login to add a commentAdd a comment