The Kashmir Files Director Vivek Agnihotri Praises Sita Ramam Movie Team - Sakshi
Sakshi News home page

Vivek Agnihotri: ‘సీతారామం’ మూవీ హీరోహీరోయిన్లపై ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌ ’డైరెక్టర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Published Tue, Sep 20 2022 1:06 PM | Last Updated on Tue, Sep 20 2022 2:04 PM

The Kashmir Files Director Vivek Agnihotri Praises Sita Ram Movie Team - Sakshi

దుల్కర్‌ సల్మాన్, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన అందమైన ప్రేమ కావ్యం ‘సీతారామం’. ఇటీవలె ప్రేక్షకుల ముందకు వచ్చిన ఈచిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆగస్ట్‌ 5న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఇప్పటికే రూ.75 కోట్ల కలెక్ట్‌ చేసి రికార్డు సృష్టించింది. ఈ ప్రేమ కావ్యం అమెరికాలో సైతం మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఇటీవల ఈ మూవీ హిందీ వెర్షన్‌లో కూడా విడుదలైంది.

చదవండి: రూ. 750 అద్దె ఇంట్లో నివాసం, సీనియర్‌ నటి దీనస్థితి.. మంత్రి పరామర్శ

ఇక ఈ సినిమా చూసిన ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ డైరెక్టర్‌ వివేక్‌ అగ్నిహోత్రి సీతారామంపై ప్రశంసలు కురిపించాడు. అంతేకాదు హీరోహీరోయిన్లు దుల్కర్‌, మృణాల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ‘నిన్న రాత్రే హను రాఘవపూడి తెరకెక్కించిన 'సీతారామం' సినిమా చూశాను. ఇక దుల్కర్ సల్మాన్‌ నటన నన్ను బాగా ఆకట్టుకుంది. అతడి నటన చాలా సహాజంగా ఉంది. రిఫ్రెషింగ్‌గా అనిపించింది. ఇక యువ నటి మృణాలి ఠాకూర్‌ గురించి ఏం చెప్పిన తక్కువే. తొలిసారి తన నటన చూశాను. చాలా ఫ్రెష్‌గా సహాజంగా ఉంది. తను పెద్ద స్టార్‌ అవుతుంది. సీతారామం టీంకు నా శుభాకాంక్షలు’ అంటూ ఆయన కొనియాడాడు. 

చదవండి: బిగ్‌బాస్‌ హౌజ్‌లో నాకు అన్యాయం జరిగింది: అభినయ శ్రీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement